జమ్మికుంట ఫ్లై ఓవర్ బ్రిడ్జి పెచ్చులూడి పడి తృటిలో తప్పిన పెను ప్రమాదం

  • ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రాణ నష్టం జరిగే వరకు చలించరా..?

జమ్మికుంట, మే 22 (విశ్వం న్యూస్) : ఐదు రోజుల క్రితం జమ్మికుంట ప్లై ఓవర్ బ్రిడ్జి కింది భాగం పెచ్చులూడి నేరేడు పండ్లు అమ్ముతున్న తాండ్ర రాజమ్మకు కొన్నిఅడుగుల దూరంలో పెద్ద పెద్ద పెచ్చులు పడ్డాయి. అందులో నుండి కొన్ని పెచ్చులు ఆమె మోచేతి మీద పడి తీవ్రగాయాలు ఆయ్యాయి. అవే పెద్ద పెచ్చులు వృద్ధురాలి తలపై పడితే వెంటనే ప్రాణం పోయేదని, సంఘటన సమయంలో అక్కడున్న స్థానిక వ్యక్తులు తెలిపారు. ఇది కచ్చితంగా నాణ్యత లేని ఇసుక, సిమెంట్, స్టీల్ వాడారని కాంట్రాక్టర్ చేసిన పెను తప్పిదమని, ఇంజనీరింగ్ విభాగం అధికారుల పర్యవేక్షణ లేకపోవడం కూడా ఒక కారణమని స్థానికులు భయభ్రాంతులకు గురై ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ విషయం ఇలా ఉంచి గతంలోకి వెళితే …
అప్పటి ఎం.ఎల్.ఏ ఈటెల, అప్పటి ఎం.పి పొన్నంలు గా ఉన్నపుడు వారి హాయాంలో బ్రిడ్జి నిర్మాణం చేపట్టారు. కాంట్రాక్టర్ సుదర్శన్ రెడ్డికి 1 సంవత్సర కాలంలో బ్రిడ్జి కట్టాలనే అగ్రిమెంట్ నిబంధనలున్నా కానీ.. 3 సంత్సరాలకు పైగా బ్రిడ్జి నిర్మాణం జరిగింది. అంత సమయం తీసుకున్న రాజకీయ నాయకుల, అలసత్వమే. అదేవిధంగా ఇంజనీరింగ్ విభాగం అధికారుల పర్యవేక్షణ లేక కాంట్రాక్టర్, నాణ్యతలేని ఇసుక సిమెంట్ స్టీల్ వాడటం వలనే ఈ పెను ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కరీంనగర్ జిల్లా కలెక్టర్ మంత్రులు కే.టీ.ఆర్, గంగుల కమలాకర్, ఎం.ఎల్.సి కౌశిక్ రెడ్డిలు చొరువ తీసుకొని ఇంజనీరింగ్ అధికారుల పర్యవేక్షణలో బ్రిడ్జిని మరొకసారి పునర్ పరిశీలించి జమ్మికుంట ప్రజలు కాపాడాలని కోరుతున్నారు.

ఈ పెను ప్రమాదం వెనక తప్పు ఎవరిది..?
అప్పుడు బ్రిడ్జి నిర్మాణం జరిగినప్పుడు దుమ్ము ధూళితో వలన చిన్న పిల్లల నుండి వృద్ధుల వరకు డస్ట్ ఎలర్జీ, అస్తమా వంటి దీర్ఘ కాల వ్యాధులు వ్యాపించాయి. ఈ వ్యాధుల వలన వేలల్లో ఖర్చు బరిస్తున్న ప్రజలు .

ఈ తప్పు ఎవరిది ఎమ్మెల్యే ఈటెలదా.,
అప్పటి ఎం.పి పొన్నందా…?
బ్రిడ్జి ప్రారంభానికి ముందే నాణ్యతా ప్రమాణాల పరీక్షలు జరిపితే కాంట్రాక్టర్ ది తప్పు అని ముందే తెలిసేది. నాణ్యతా ప్రమాణాలు చేయకుండా బ్రిడ్జిని ఎలా ఉపయోగంలోకి తీసుకవచ్చారు అనేది ప్రజలకు అంతుపట్టని ప్రశ్నగా మారింది. ఈ తప్పు కాంట్రాక్టర్, అధికారులది అయితే వారిని సరిగా పని చేయించే అధికారం ఎమ్మెల్యే ఈటలకు, అప్పటి ఎం.పి పొన్నం కు ఉంది.

బ్రిడ్జి నిర్మాణ కాలపరిమితికి మించినపుడు ప్రజాప్రతినిధులైన ఎం.ఎల్.ఏ ఈటల, అప్పటి ఎం.పి పొన్నం ఇరువురు కలిసి కాంట్రాక్టర్ తో ఎందుకు నాణ్యమైన పనులు చేయించలేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. దీని వెనుకాల ఉన్న అంతర్మధనం ఏమిటో ప్రజల కు అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. బ్రిడ్జి నిర్మాణం పూర్తయిన తరువాత నాణ్యతా ప్రమాణ పరీక్షలు జరిగాయా..? ఒకవేళ జరిగుంటే .. గతంలో ఒకప్పుడు అదేవిధంగా మొన్న నాలుగు రోజుల క్రితం పెచ్చులు ఊడడం ఎంటని ప్రజలు ముక్కు మీద వేలు వేసుకుంటున్నాను. బ్రిడ్జి నిర్మాణం పూర్తయిన తరువాత నాణ్యతా ప్రమాణ పరీక్షలు జరుపకుండా బ్రిడ్జి ప్రారంభించటం పట్ల భిన్న అభిప్రాయాలు వినబడుతున్నాయి. అప్పటి నుండి అప్పటి వరకు ఎం.ఎల్.ఏ గా ఉన్న ఈటల కాని మాజీ ఎం.పి పొన్నం కాని ప్రజలకు స్పష్టత ఇవ్వాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

హేవీ లోడ్ అక్రమ ఇసుక
లారీలే కారణమా … కాదా ..?
(అక్రమ ఇసుక దందాను ఎవరూ ప్రోత్సహించరు.)

హెవీ లోడ్ అక్రమ ఇసుక లారీల రవాణా నే బ్రిడ్జి శిఖలాలు ఊడి పడుతున్నాయని అనుకుంటే, ఇసుక క్వారీ లారీల రవాణ లేనప్పుడు కూడా బ్రిడ్జి పగుళ్లు వచ్చి పెచ్చులు ఊడి పడ్డాయి.అంటే బ్రిడ్జి నిర్మాణం సరైన నాణ్యతా ప్రమాణాలతో నిర్మాణం జరుగలేదనేది తేటతెల్లమవుతుంది.

దీనంతటికీ కొసమెరుపు…
గతంలో పెచ్చులూడినప్పుడే తగిన చర్యలు తీసుకుంటే మళ్లీ పెచ్చులూడే పరిస్థితి వచ్చేది కాదని, జమ్మికుంట ఫ్లై ఓవర్ బ్రిడ్జి వలన ప్రజలకు రవాణా కు సౌకర్య వంతంగా ఉండేది. కానీ.. మళ్లీ పెచ్చులూడి తృటిలో తప్పిన ప్రాణాపాయం జరిగేది కాదు. కాబట్టి ఇదంతా సంబంధిత నాణ్యతా ప్రమాణాల పరీక్షల అధికారులు, ఇంజనీరింగ్ విభాగం, కాంట్రాక్టర్ యొక్క తప్పిదం ఐనా, వారే కారణమా, ప్రజాప్రతినిధులు పర్యవేక్షణ లేకపోవడం కారణమా.?

  • అధికారులను సక్రమంగా పనిచేయించే ప్రక్రియ కోసమే ప్రజా ప్రతినిదులు- మొదట వారిదే తప్పు అంటున్న ప్రజానికం. బ్రిడ్జి పెచ్చులు ఊడి బ్రిడ్జి క్రింద పండ్లు అమ్ముకుంటున్న వృద్ధురాలికి గాయాలు ఐన నాలుగు రోజుల కు బ్రిడ్జిని సందర్శించిన చైర్మన్ రాజేశ్వర్ రావు. ఐనా గతంలో పెచ్చులు ఊడి క్రింద పడినపుడు కూడా ప్రాణా పాయం తప్పింది చిరు వ్యాపారికి, వాహనదారులకు. గతంలో పెచ్చులు ఊడినప్పుడు కొంత కాలానికి బ్రిడ్జిని ప్రజాప్రతినిధులు, అధికారులు, సందర్శించడం, సందర్శించినట్లు, పరిశీలించినట్లు ఫోటోలు దిగడం వరకే సరిపోతుంది అని ప్రజలు వాపోతున్నారు. గతంలో పెచ్చులు ఊడిన బ్రిడ్జిని సందర్శించడం తప్ప ఎవరూ ఏమీ చర్యలు తీసుకోలేక పోవడం అధికారులకు, ప్రజాప్రతినిధులకు ప్రజల ప్రాణాల పట్ల ఎంత బాధ్యత ఉందో అని ప్రజలు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు.

ఏది ఏమైనప్పటికీ తప్పు ఎవరు చేసినా, నష్టం జరిగేది ప్రజలకే కావున స్థానిక ఎం.ఎల్.సి కౌశిక్, ఎమ్మెల్యే ఈటల, ఎం.పి బండి కలిసి సమన్వయంతో ప్రజల ప్రాణాలను దృష్టిలో ఉంచుకుని జిల్లా మంత్రి గంగులతో, మున్సిపల్ మంత్రి కే.టి.అర్ ను సంప్రదించి ప్రభుత్వంచే బ్రిడ్జిని క్షుణ్నంగా సాంకేతికంగా పరిశీలించి, లోపాలను గుర్తించి తగు చర్యలు తీసుకోని దృఢంగా బ్రిడ్జిని ఉంచాలని, మా ప్రాణాలను కాపాడాలని ప్రజల కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *