జమ్మికుంట:ఉచిత మెగా
వైద్య శిబిరం విజయవంతం

- శ్రీ విద్యారణ్య ఆవాస
విద్యాలయం కేశవపురం నందు
జమ్మికుంట, ఆగస్టు 18 (విశ్వం న్యూస్) : జమ్మికుంట పట్టణ పరిధిలోని శ్రీ విద్యారణ్య ఆవాస విద్యాలయం కేశవపురం నందు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మెగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరానికి 40 మంది వైద్యలు హాజరై ఆవాస విద్యాలయంలోని విద్యార్థిని విద్యార్థులకు అన్ని రకాల వ్యాధులకు సంబంధించి పరీక్షలు నిర్వహించడంతోపాటు ఉచిత మందులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చిన వైద్య నిపుణులు అందరికీ పాఠశాల విద్యార్థులు ప్రత్యేక స్వాగతం పలకడంతో పాటు సాంస్కృతిక కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ సుధాకర్, డాక్టర్ ముషం సురేష్, డాక్టర్ అనిత,డాక్టర్ సత్యం, డాక్టర్ ముక్క రాజేశ్వరయ్య, డాక్టర్ ముక్క రాము, డాక్టర్ శ్రీవాణి, డాక్టర్ రాణి,డాక్టర్ సుధాకర్, డాక్టర్ పద్మజ, డాక్టర్ రమేష్, డాక్టర్ తిరుపతయ్య,డాక్టర్ సురంజన్, డాక్టర్ లావణ్య, డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి, డాక్టర్ తిరుపతి,డాక్టర్ స్వర్ణ,డాక్టర్ దేవేందర్ రెడ్డి, డాక్టర్ ఆమని, డాక్టర్ ముక్క శరత్, డాక్టర్ ముక్క మౌనిక, డాక్టర్ సురేష్, డాక్టర్ మురళి, డాక్టర్ శ్రీకాంత్ రాజ్, డాక్టర్ రామకృష్ణ, డాక్టర్ హరిత, డాక్టర్ వంశీ, డాక్టర్ తులసీదాస్, డాక్టర్ రామలింగారెడ్డి, డాక్టర్ చంద్రమౌళి, డాక్టర్ నాగలింగం, ప్రముఖ కంటి వైద్య నిపుణులు చిట్టి రెడ్డి శ్రీనివాసరెడ్డి, జమ్మికుంట సివిల్ హాస్పిటల్ సూపరిండెంట్ డాక్టర్ రమేష్, శ్రీ విద్యారణ్య ఆవాస విద్యాలయం ప్రధానాచార్యులు సుధాకర్ రావు, పాఠశాల కమిటీ ప్రధాన కార్యదర్శి చిదురాల భాస్కర్, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
