కరీంనగర్:అల్ఫోర్స్ విద్యాసంస్థ యువశాస్త్రవేత్తలకు ఘన సన్మానం

కరీంనగర్:అల్ఫోర్స్ విద్యాసంస్థ
యువశాస్త్రవేత్తలకు ఘన సన్మానం

కరీంనగర్ బ్యూరో, ఏప్రిల్ 16 (విశ్వం న్యూస్) : భారత దేశం సాంకేతిక విప్లవాలకు నిలయమని మరియు పలు అవిష్కరణలకు దిక్సూచి అని అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డా॥ వి.నరేందర్ రెడ్డి గారు స్థానిక కరీంనగర్లోని ఒక వేడుక మందిరంలో అల్ఫోర్స్ పాఠశాలలకు చెందిన వివిద యువ శాస్త్రవేత్తలకు ఏర్పాటు చేసిన ప్రత్యేక అభినందన సభకు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశం సాంకేతిక రంగంలో ఇతర దేశాలకంటే అగ్రగామిగా కొనసాగుతుండం శుభపరిణామమని మరియు ఇతర దేశాలకు సైతం సాంకేతిక సహాయాన్ని అందిచడం గొప్ప విషయమని గుర్తుచేస్తూ గత 10 సంవత్సరాలుగా భారతశాస్త్రవేత్తలు నిర్విరామంగా కృషి చేస్తూ నూతన ఒరవడిని సృస్టిస్తున్నారని మరియు ఆదర్శంగా నిలవడం చాలా గొప్ప విషయమని చెప్పారు. మన దేశానికి వైభవాన్ని అందించిన సి.వి. రామన్ గారు, డా॥ ఎ.పి.జె. అబ్ధుల్ కలాం గారు, ఆర్యభట్ట గారు, జె.సి. బోన్ గారు, స్వామినాథన్ గారు, తదితరల నుండి స్పూర్తిపొందుతున్నామని మరియు వారు చేసిన అవిష్కరణలు చాలా చారిత్రాత్మకమైనవని కొనియాడరు.

విద్యార్థులలో సాంకేతిక పరిజ్ఞానాన్ని పొంపొందించటానికై మరియు దాగివున్న ప్రతిభను వెలికితీయడానికై నిపుణులైన ఉపాద్యాయులచే అభ్యేధమైన శిక్షణను ఇప్పిస్తూ వివిధ స్థాయిలలో నిర్వహంపబడే పలు పొటీలలో జైత్రయాత్రను కొనసాగిస్తూ తెలంగాణ రాష్ట్ర విద్యారంగానికి ఆదర్శంగా నిలుస్తున్నారని చెప్పారు. ఈ విద్యసంవత్సరంలో సుమారు 11 మంది విద్యార్థులు వివిధ స్థాయిలలో వారి ప్రతిభను చాటి జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకున్నారని విశేషంగా ప్రముఖులైన గౌరవ రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారిచే మరియు అత్యుత్తమ శాస్త్రవేత్తల నుండి ప్రశంసలను పొందడం జరిగినదని చెప్పారు. అదేవిధంగా చాలా మంది విద్యార్థులకు ప్రశంస పత్రాలతో పాటు పతకాలను అందజేయడం జరిగినదని తెలుపుతూ వీరందరికి నేడు ఘనసన్మానం చేయడం జరిగిందని ఒక ప్రకటనలో తెలిపారు.

యం. పూజశ్రీ, 9వ తరగతి, కే. దేవ్ అశీశ్, 9వ తరగతి, వి. సంజీత రెడ్డి, 10వ తరగతి, జి. లాస్యశ్రీ, 9వ తరగతి, యం. సాయి వీనిల్ 9వ, తరగతి, డి. విష్ణుచరణ్ 9వ తరగతి, షర్మీల, 9వ తరగతి, శీజా రీఫాత్ 8వ తరగతి, డి. శ్రీహష్, 9వ తరగతి, సజీనిన్ 8వ తరగతి, రొమైసా ఫాతిమా 8వ తరగతి, యం. సాయిరేవంత్, 9వ తరగతి, యం. అగష్య అభినవ్ 9వ తరగతి, శ్రీజా రేడ్డి, 9వ తరగతి సన్మానం పొందిన వారిలో ఉన్నారు.

ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలల ప్రిన్సిపాల్స్, ఉపాద్యాయులు, తల్లితండ్రులు మరియు విద్యార్థులు పాల్గోన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *