కరీంనగర్:ముకరంపురలో గడప గడపకు కాంగ్రెస్

కరీంనగర్:ముకరంపురలో
గడప గడపకు కాంగ్రెస్

  • నగరం నడిబొడ్డున కూడా ప్రజలు సమస్యలతో సతమతం
  • నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి

కరీంనగర్, ఆగస్టు 8 (విశ్వం న్యూస్) : కాంగ్రెస్ పథకాలతో కూడిన కరపత్రాలను పంపిణీ చేస్తూ ముకరంపుర లో గడప గడపకు కాంగ్రెస్ కార్యక్రమం చేపట్టారు.ఈ సందర్భంగా నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ నగరం నడిబొడ్డున కూడా ప్రజలు సమస్యలతో సతమత మవుతున్నారని జామా మసీదు వెనుక భాగంలో రోడ్డు మురికి కాలువ అధ్వాన్నంగా ఉందని వర్షం నీళ్లకు మురికి కాలువ నీళ్ళు తోడవడంతో ఎక్కడికక్కడ నిలిచిపోతున్నాయని అన్నారు.

మల్టీ పర్పస్ గ్రౌండ్ ఎటుకాకుండ చేశారని పార్క్ పనులు గత నాలుగు సంవత్సరాలుగా కొనసాగుతూనే ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ బాధ్యుడు పెద్దిగారి తిరుపతి, ఎండి తాజ్, గుండాటి శ్రీనివాస్ రెడ్డి, చంద్రయ్య గౌడ్, కుర్ర పోచయ్య, ఎండి చాంద్, షబానా మహమ్మద్, పొరండ్ల రమేష్, ముల్కల కవిత, అన్నే జ్యోతి రెడ్డి, మాకల నర్సయ్య, మెతుకు కాంతయ్య, నెల్లి నరేష్, లాయాక్, నిహాల్ అహ్మద్, ముక్క భాస్కర్, ఎగ్గడి శారద, మహమ్మద్ భారీ, మామిడి సత్యనారాయణ రెడ్డి, బషీర్, హనీఫ్, ముల్కల యోన, జిలకర రమేష్, దామోదర్, ఖలీమ్, ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *