కరీంనగర్:ఘనంగా మాజీ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ వర్ధంతి

కరీంనగర్:ఘనంగా మాజీ ప్రధాని
జవహర్‌లాల్ నెహ్రూ వర్ధంతి

  • పంచవర్ష ప్రణాళికలతో దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన ఘనత మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూది
  • కూడలి అభివృద్ధి సందర్భంగా తొలగించిన నెహ్రూ విగ్రహాన్ని పాలకులు తిరిగి నెలకొల్పడం లేదు

కరీంనగర్ బ్యూరో, మే 27 (విశ్వం న్యూస్) : స్వాతంత్ర్యోద్యమంలో కీలక భూమిక పోషించడమే కాకుండా స్వాతంత్ర్యం సిద్ధించిన తర్వాత మొట్ట మొదటి ప్రధానమంత్రిగా పంచవర్ష ప్రణాళికలతో దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన ఘనత మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ గారిది అని నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు.నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో నెహ్రూ వర్ధంతి వేడుకలు సవరన్ స్ట్రీట్ కూడలి వద్ద ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ గ్రామాలలో కనీస విద్యుత్ సౌకర్యం లేక నిరక్షరాస్యతతో ప్రజలు ఉన్న పరిస్థితి నుండి అభివృద్ధి చెందిన దేశాలతో పోటీపడే విధంగా దేశాన్నిముందుకు తీసుకు వెళ్ళిన ఘనత మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ గారిది అని కొనియాడారు.నగరంలో గత నలభై సంవత్సరాలుగా సవరన్ స్ట్రీట్ కూడలి వద్ద నెహ్రూ విగ్రహం ఉన్నదని రోడ్డు అభివృద్ధి సందర్భంగా తొలగించిన విగ్రహాన్ని మూడు సంవత్సరాలైనా తిరిగి నెలకొల్పడం లేదని ఇప్పటికైనా వెంటనే నెలకొల్పాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో సమద్ నవాబ్, గుండాటి శ్రీనివాస్ రెడ్డి, శ్రవణ్ నాయక్, గడ్డం విలాస్ రెడ్డి, కుర్ర పోచయ్య, దండి రవీందర్, ఎండి చాంద్, జీడీ రమేష్, ఊరడి లత, షబానా మహమ్మద్, ముల్కల కవిత,మామిడి సత్యనారాయణ రెడ్డి, అన్న జ్యోతి, కంకణాల అనిల్ కుమార్, ముక్క భాస్కర్, మెతుకు కాంతయ్య,షేహెన్ష,కీర్తి కుమార్, ఆశ్రాఫ్, లింగమూర్తి, నెల్లి నరేష్, అఙ్మత్,మహమ్మద్ భారీ,సిరాజ్,షాహిద్, జీలకర రమేష్, కమల్, ఆంజనేయులు, సదానందం, రామచంద్ర గౌడ్, కుతుబుద్దిన్, రహేమాన్, రవీందర్ రెడ్డి, సాయిరాం తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *