కరీంనగర్:పేదల ఇండ్లు కూల్చివేయడం దుర్మార్గపు చర్య

కరీంనగర్:పేదల ఇండ్లు
కూల్చివేయడం దుర్మార్గపు చర్య

  • ఇండ్లు కూల్చివేస్తుంటే స్థానిక మంత్రి ఎందుకు పట్టించుకుంటలేడు
  • గ్రామ పంచాయితీ పర్మిషన్లు, ఇంటి నెంబర్ లు ఉండగా జెసిబిలతో కూల్చివేస్తారా.
  • కోర్టు పరిధిలో ఉన్న మిగితాభూమి జోలికి ఎవరురావడం లేదు, పేదల జోలికి వస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు.
  • రేకుర్తి అంబేడ్కర్ విగ్రహంవద్ద ధర్నా చేస్తున్న బాధితులను కలిసి మాట్లాడిన నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి.

కరీంనగర్ బ్యూరో, మే 18 (విశ్వం న్యూస్) : గత ముప్పై సంవత్సరాల నుండి నివాసముంటూ గ్రామ పంచాయితీ పర్మిషన్ లు తీసుకొని ఇంటి పన్నులు చెల్లిస్తున్న పేదల ఇండ్లు ఎటువంటి నోటీసులు గాని సమాచారం గాని ఇవ్వకుండా కూల్చివేయడం ఎంటనీ నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ప్రశ్నించారు. రేకుర్తి అంబేడ్కర్ కూడలి వద్ద ధర్నా చేస్తున్న షేకాభి కాలని బాధితులను పరామర్శించి మాట్లాడారు. పేదల ఇండ్లు కుల్చేయమని ఎక్కడా కోర్టు పేర్కొనలేదని మిగితా భూమి జోలికి ఎవరు రావడం లేదని ఇందులో ఏదో అదృశ్యశక్తి వెనుకాల ఉండడం వల్లనే ఇదంతా జరుగుతుందన్నారు. స్థానిక మంత్రి గంగుల కమలాకర్ పేదల ఇండ్లు కూల్చివేస్తుంటే ఎందుకు పట్టించుకోవడం లేదని నరేందర్ రెడ్డి ప్రశ్నించారు. ఇండ్లు కూల్చి వేయబడ్డ బాధితులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో సమద్ నవాబ్, ఎండి చాంద్,గుండాటీ శ్రీనివాస్ రెడ్డి, గడ్డం విలాస్ రెడ్డి, అస్తపురం రమేష్, కుర్ర పోచయ్య,మెతుకు కాంతయ్య,షబానా మహమ్మద్, ముక్క భాస్కర్, ముల్కల కవిత, పొరండ్ల రమేష్, మామిడి సత్యనారాయణ రెడ్డి, చంద్రయ్య గౌడ్,షాహిద్, తమ్మడి ఎజ్రా, గాదె శివరాం,షేహెన్ష, అష్రఫ్ ఖురేషి, బొబ్బిలి విక్టర్, జిలకర రమేష్,హనీఫ్, కమల్, సాజిత్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *