ఏఐసిసి ప్లీనరీలో కరీంనగర్ జిల్లా నేతలు

ఏఐసిసి ప్లీనరీలో కరీంనగర్ జిల్లా నేతలు

రాజకీయాలకు రిటైర్మెంట్ ప్రకటించిన సోనియా గాంధీ గారు తెలంగాణ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు. -పొన్నం ప్రభాకర్

చత్తీస్గడ్, పిబ్రవరి 25 (విశ్వం న్యూస్) : చత్తీస్గడ్ రాష్ట్ర రాజధాని రాయపూర్ లో నేటి నుండి మూడు రోజులపాటు జరగనున్న అఖిలభారత కాంగ్రెస్ పార్టీ 85వ ప్లీనరీలో కరీంనగర్ జిల్లా నుండి ముఖ్య నేతలు హాజరైనారు. కాగా సోనియా గాంధీ గారు రాజకీయాలనుండి తప్పుకుంటున్నట్లుగా చేసిన ప్రకటన పట్ల ఆవేదన వ్యక్తం చేస్తూ క్లిష్ట పరిస్థితుల్లో దేశ ప్రజలకు అండగా ఉండడమే కాకుండా కరీంనగర్ వేదికగా ఇచ్చిన హామీ ప్రకారం తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి తెలంగాణ ప్రజల గుండెల్లో నిలిచిపోయారని, వారిని ఆదర్శంగా తీసుకొని కాంగ్రెస్ పార్టీ శ్రేణులమైన మేమంతా ఈ దేశ సమైక్యత కోసం దేశ అభివృద్ధి కోసం పాటుపడతామని మాజీ పార్లమెంట్ సభ్యులు పొన్నం ప్రభాకర్, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డా.కవ్వంపల్లి సత్యనారాయణ, హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బలుమూరి వెంకట్, పీసీసీ మెంబర్ బత్తిని శ్రీనివాస్ గౌడ్ మరియు పలువురు నేతలతో కలిసి ములుగు శాసన సభ్యురాలు శ్రీమతి సీతక్క, నిజామాబాద్ మాజీ పార్లమెంట్ సభ్యులు మధు యాష్కీ గౌడ్, వరంగల్ మాజీ పార్లమెంట్ సభ్యులు సిరిసిల్ల రాజయ్య, పిసిసి ప్రోటోకాల్ కన్వీనర్ హర్కాల వేణుగోపాల్ తదితరులు పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *