కరీంనగర్:ముస్లింలకు
రంజాన్ దుస్తుల పంపిణీ

- సర్వ మతాల పండగలకు అధిక ప్రాధాన్యం
- 33 వ డివిజన్ భగత్ నగర్ లో ముస్లింలకు పవిత్ర రంజాన్ పండుగ కానుకలు అందించిన మేయర్ యాదగిరి సునీల్ రావు
కరీంనగర్ బ్యూరో, ఏప్రిల్ 18 (విశ్వం న్యూస్) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో సర్వ మతాల పండగలను ముఖ్యమంత్రి కేసీఆర్ గౌరవించడం జరుగుతుందని నగర మేయర్ యాదగిరి సునీల్ రావు అన్నారు. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా మంగళవారం రోజు మేయర్ ప్రాతినిధ్యం వహిస్తున్న 33 వ డివిజన్ భగత్ నగర్ లో పెద్దమ్మ టెంపుల్ దేవాలయ సమీపంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించే రంజాన్ పండగ కానుకలను మేయర్ యాదగిరి సునీల్ రావు తన చేతుల మీదుగా ముస్లిం మహిళలకు పంపిణీ చేశారు. పవిత్ర రంజాన్ పండగ వేడుకలను ఆనంధోత్సవాల మద్య జరుపుకోవాలని ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా మేయర్ యాదగిరి సునీల్ రావు మాట్లాడుతూ గతంలో ఏ ప్రభుత్వాలు కూడా తెలంగాణ ప్రాంతంలో జరిగే పండగలను గుర్తించి ప్రజలకు కానుకలు అందించిన దాఖాలాలు లేదన్నారు. తెచ్చుకున్న తెలంగాణ లో సర్వ మతాల ప్రజలు తమ పండగలను సంతోషంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని మతాల పండగలను గౌరవిస్తూ కానుకలు అందించే సంస్కృతిని ప్రారంభించారని తెలిపారు. బతుకమ్మ, దసరా పండగలకు మహిళలకు చీరలు, రంజాన్ పండగ కు ముస్లింలకు తోఫాలు, క్రైస్తవులకు క్రిస్మస్ కానుకలు అందించడం జరుగుతుందని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అందిస్తున్న సంక్షేమ పథకాల ద్వారా ప్రజలు సంతోషం వ్యక్తం చేయడంతో పాటు పండగలను సుఖ సంతోషాలతో జరుపుకుంటున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మా పండగలను మమ్మల్ని గుర్తించి మాకు కానుకలు ఇవ్వడం చాలా సంతోష కరమని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. గతంలో ఎన్నో ప్రభుత్వాలు పాలించినా పండగలను గుర్తించి కానుకలు ఇవ్వలేదని ప్రజలు వెల్లడిస్తున్నట్లు తెలిపారు.

ప్రజలంతా ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రతి పండగకు నిండు మనస్సుతో దీవెనలు అందిస్తున్నారని తెలిపారు. ముస్లిం ల పవిత్ర పండగ రంజాన్ సందర్భంగా ప్రభుత్వం ద్వారా అందించే కానుకలను 33 వ డివిజన్ లో ముస్లిం సోదరులకు పంపిణీ చేసి నట్లు తెలిపారు. నగరంలో 60 డివిజన్ లలో పేద మైనార్టి ప్రజలకు ప్రభుత్వం ద్వారా అందించే రంజాన్ కానుకలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. రంజాన్ పండగను పురస్కరించుకుని నగరపాలక సంస్థ ద్వారా 34 లక్షలతో పెద్ద ఎత్తున ఏర్పాటు చేశామన్నారు. నగరంలోని అన్ని ఈద్గల్లో పరిశుభ్రత పనులతో పాటు కావల్సిన సౌకర్యాలు కల్పించామన్నారు. తెలంగాణ ప్రభుత్వం లో సర్వ మతాల పండగలన్ని సంతోషంగా జరురుకోవాలన్నదే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అన్నారు. పేద ముస్లిం ప్రజలకు ప్రత్యేకంగా షాదీముబారాక్ పథకం ద్వారా ఆడబిడ్డల పెల్లికి 1 లక్ష 116 రూ ప్రభుత్వం అందిస్తుందని స్పష్టం చేశారు.
తెలంగాణ ప్రభుత్వం పేద ప్రజలకు అండగా ఉండి బరోసా కల్పిస్తూ ప్రదలకు కావల్సిన సంక్షేమ పథకాల ద్వారా సౌకర్యాలు కల్పిస్తుందన్నారు. ప్రజల సంక్షేమం కోరే ప్రభత్వానికి ముఖ్యమంత్రి కేసీఆర్ కు మనమంతా అండగా ఇండాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో కార్పోరేటర్ సల్ల శారద రవీందర్, బీఆర్ఎస్ నాయకులు హామీద్, సంజయ్, పండగ నాగరాజు, కుంభం అనిల్ తదితరులు పాల్గొన్నారు.