కరీంనగర్:ఇన్స్టలేషన్,
పి.ఎస్.టి. ట్రైనింగ్ నిర్వహణ

డా. ఎలగందల శ్రీనివాస్ (వాసుదేవ హాస్పిటల్)
తిమ్మాపూర్, మే 19 (విశ్వం న్యూస్) : కరీంనగర్ లోని ఐఎంఏ హాల్లో శుక్రవారం అసోసియేషన్ ఆఫ్ అలయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్టిక్ -137 ఏ ఆధ్వర్యంలో ఇన్స్టలేషన్ ప్రోగ్రాంను కరీంనగర్ నగర మేయర్ యాదగిరి సునీల్ రావు చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన అలయన్స్ క్లబ్స్ ఇంటర్నే షనల్ వైస్ ప్రెసిడెంట్ ఆర్. మత్తివన్నన్, ఇంటర్నే షనల్ డైరెక్టర్ నవీన శెట్టింగర్, ఇంటర్నేషనల్ కమిటీ చైర్మన్ డా. ఎలగందల శ్రీనివాస్ (వాసుదేవ హాస్పిటల్) చేతుల మీదుగా ఇన్స్టాలేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ గవర్నర్ డా. గాలిపెల్లి నాగేశ్వర్, వైస్ డిస్టిక్ట్ గవర్నర్ చేరిమెల వెంకటేశ్వర్లు, వైస్ డిస్టిక్ట్ గవర్నర్ చీకోటి శ్రీనివాస్ గాంధీ, పిఆర్ఓ సాగర్ రెడ్డి, డిస్టిక్ట్ కాబినెట్ ట్రెజరర్ కామినేని శ్రీనివాస్ లకు డిస్టిక్-137 బాధ్యులుగా చేస్తూ ప్రమాణస్వీకారోత్సవాన్ని నిర్వహించారు.
అనంతరం అసోసియేషన్ అఫ్ అలయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్టిక్ట్ 137/ఏ కరీంనగర్, డిస్టిక్ట్-258 మంచిర్యాల సంబంధించిన సుమారు 60 క్లబ్ లకు చెందిన ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్లకు పి.ఎస్.టి. ట్రైనింగ్ ప్రోగ్రామ్ ను నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన నగర మేయర్ వై సునీల్ రావు మాట్లాడుతూ… స్వదేశంలో స్థాపించబడి విదేశాల్లో విస్తరించిన అసోసియేషన్ ఆఫ్ అలయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ సేవలు ప్రశంసనీయమని తెలిపారు. ఈ సంస్థలో నేను భాగస్వామిని అయ్యి లైఫ్ మెంబర్ అయినందుకు గర్విస్తు న్నానని, ఈ సందర్భంగా తమ సంతోషాన్ని వ్యక్తపరిచారు. భవిష్యత్తులో ఈ సంస్థ సమాజ హితానికి పాటుపడుతూ మరెన్నో విజయ శిఖరాలను అధిరో హించాలని ఆకాంక్షించారు. అసోసియేషన్ అలయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ 1 ఆర్ మత్తి వన్నన్, ఇంటర్నేషనల్ డైరెక్టర్ నవీనశెట్టింగర్, ఇంటర్నేషనల్ కమిటీ చైర్మన్ లు డా. ఎలగందల శ్రీనివాస్ (వాసుదేవ హాస్పిటల్), కోల అన్నారెడ్డి, ఈద కుమారస్వామి, సిరిపురం సత్యనారాయణ, డిస్టిక్ట్ 137 ఏ గవర్నర్ గాలిపల్లి నాగేశ్వర్, డిస్టిక్ట్ 258 మంచిర్యాల గవర్నర్ సిరిపురం రాజేశం, సిద్దిపేట జిల్లా గవర్నర్ సోమవనజ, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.