కరీంనగర్:ఘనంగా మే డే వేడుకలు

కరీంనగర్:ఘనంగా మే డే వేడుకలు

  • బిఆర్ టీయూ ఆద్వర్యంలో పలు చోట్ల కార్మీక జెండాలను ఆవిష్కరించిన మేయర్ యదగిరి సునీల్ రావు
  • నినాదాలు చేస్తూ… కార్మీకులకు స్వీట్లు తినిపించి శుభాకాంక్షలు తెలిపిన మేయర్
  • పరిశ్రమలను ప్రైవేటు పరంచేస్తూ… కేంద్ర ప్రభుత్వం కార్మీకుల పొట్టకొడుతుంది
  • కేంద్రంలో కార్మీకుల వ్యతిరేక ప్రభుత్వం గా బీజేపి పనిచేస్తుంది

కరీంనగర్ బ్యూరో, మే 1 (విశ్వం న్యూస్) : కార్మీకుల పక్షపాతిగా… కార్మిక సంక్షేమ ద్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని కరీంనగర్ నగర మేయర్ యాదగిరి సునీల్ రావు అన్నారు. కరీంనగర్ లో 137 వ మే డే వేడుకలు ఘనంగా జరిగాయి. సోమవారం రోజు వివిధ కార్మీక సంఘాల నాయకులు, కార్మీకుల సమక్షంలో నగర వ్యాప్తంగా కార్మిక జెండాలు రెప రెప లాడాయి. మొదటగా నగరపాలక సంస్థ కార్యాలయ సమీపంలో బీఆర్ టీయూ ఆద్వర్యంలో నగరపాలక సంస్థ కార్మీకుల జెండాను నగర మేయర్ యాదగిరి సునీల్ రావు ఆవిష్కరించి… మే డే నినాదాలు చేశారు.

అనంతరం కార్మీకులకు స్వీట్లు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. మరో వైపు కరీంనగర్ బస్టాండ్ సమీపంలో బీ ఆర్ టీ యూ ఆద్వర్యంలో వివిధ కార్మీక విభాలకు చెందిన జెండాను ఎగరవేసి నినాదాలు చేశారు. అంతే కాకుండా నగరంలోని ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం వద్ద ఆటో ట్రాలీ, గూడ్స్ యూనియన్ కు సంబంధించిన కార్మీక జెండాను మేయర్ యాదగిరి సునీల్ రావు ఎగరవేసి నినాదాలు చేస్తూ స్వీట్లు పంపిణీ చేశారు. మే డే సందర్భంగా మేయర్ యాదగిరి సునీల్ రావు మాట్లాడుతూ… తెలంగాణ ప్రభుత్వం లో జరుగుతున్న కార్మీక సంక్షేమ కార్యక్రమాలు ఇతర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఎక్కడ లేవన్నారు. బీజేపి కేంద్ర ప్రభుత్వం కార్మీక వ్యతిరేక ప్రభుత్వంగా వారి చట్టలకు విరుద్దంగా వ్యవహరిస్తుందన్నారు. ప్రభుత్వ పరిశ్రమలను ప్రైవేటు పరం చేసి… కార్మీకులను నిరుద్యోగుల చేస్తుందని మండి పడ్డారు. ఆదానీ అంభానీ లాంటి కార్పోరేట్ వ్యక్తులకు పరిశ్రమలను కట్టబెట్టి కార్మీకుల పొట్టగొట్టే ప్రయత్నం చేస్తుందని తెలిపారు.

గత తొమ్మిది సంవత్సరాలు గా కార్మీక వ్యతిరేక ప్రభుత్వం గా పరిపాలన చేస్తూ…. కార్మీక విభాగాలను నిర్వీర్యం చేస్తుందని అన్నారు. గతంలో ఉన్న ప్రభుత్వాలు పరిశ్రమలు నెలకొల్పేందుకు, ఇన్ వెస్టుమెంట్ చేసేందుకు మంత్రిత్వ శాఖలు పెడితే… బీజేపి ప్రభుత్వం వాటిని తొలగించేందుకు మంత్రిత్వ శాఖలను ఏర్పాటు చేస్తుందని విరుచుక పడ్డారు. కేంద్ర ప్రభుత్వం పరిశ్రమలన్నిటీని ఒక్కొక్కటిగా ప్రైవేటు వ్యక్తులకు అమ్ముకుంటూ… భారత దేశాన్ని ప్రైవేటీకరణ వైపు నడిపించి గుజరాతీ వ్యాపార్తుల చేతుల్లోకి మల్లించే ప్రయత్నం చేయడం చాలా దురదృష్టకరం అన్నారు. తెలంగాణ రాష్ట్రం లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇలాంటి విషయాలను గమనించి అన్ని రంగాల్లో కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలను అడ్డుకునేందుకు… దేశ వ్యాప్తంగా అందరిని ఏకీకృతం చేసే ప్రయత్నం చేయడం జరుగుతుందన్నారు. మన రాష్ట్రం లో కార్మీక లోకానికి అండగా నిలుస్తున్న ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అన్నారు. కార్మీక సంక్షేమం కోసం అనేక రకాల ఇస్యూరెన్స్ స్కీంలు తెచ్చి… ప్రభుత్వ రంగాల్లో కార్మీకులకు వేతనాలు పంపిణీ చేసి కార్మీకుల అభ్యున్నతి కోసం కృషి చేస్తున్నట్లు తెలిపారు. కార్మీకుల సమస్యలను సానుకూలంగా పరిష్కరించి కార్మీక పక్షపాతిగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి కావల్సింది పెట్టుబడిదారులు మాత్రమే అన్నారు. ప్రైవేటు రంగ వ్యక్తులు బాగుండాలే… కార్మీకులప ఎప్పుడు అనచివేతకు గురిచేయబడాలని సిద్దాంతం ను నమ్ముకుని పని చేస్తున్న ప్రభుత్వం బీజేపి ప్రభుత్వమని మండి పడ్డారు. వ్యవసాయ రంగం తో పాటు ఆటో రంగం, హమాలీ, మేస్త్రీ లాంటి వివిధ రంగాల్లో పని చేస్తున్న కార్మీకులప క్షేమంగా ఉండాలని కోరుకునే ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వమని తెలిపారు. ఏ రంగంలో పని చేసే కార్మీకులైన వారు ఉపాధి కోల్పోవద్దని, ఆరంగంలో అన్ని సౌకర్యాలు కల్పించాలని పని చేస్తున్న ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వమన్నారు. రైతు అనేవాడు బాగున్నప్పుడే అన్ని కార్మీక రంగాలు అభివృద్ధి లోకి వస్తాయన్నారు. అలాంటి రైతుల సంక్షేమం కోసం వ్యవసాయ రంగానికి పెద్ద పీట వేస్తున్నట్లు తెలిపారు. రైతులకు 24 గంటలు కరెంట్, సాగు నీరు అందించి ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు.

అంతే కాకుండా రైతులకు రెండు పసల్లు రైతు బంధు ఇచ్చి వ్యవసాయాన్ని పోత్సహిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఇలా ఎన్నో రకాల సంక్షేమ కార్యక్రమాలు రైతులకు, కార్మీకులకు ప్రభుత్వం చేస్తుందన్నారు. మున్సిపల్ తో పాటు ఇతర రంగాల్లో పనిచేస్తన్న కార్మీకులకు గతంలో 6 వేల రూపాయిల వేతనంను 15 వేలకు పెంచి… ప్రతి నెల జీతాలు అందిస్తున్నట్లు తెలిపారు. మా నగరపాలక సంస్థ లో పని చేస్తున్న జౌట్ సోర్సింగ్ కార్మీకులకు ప్రతి నెల వెతనాలు చెల్లించి… ఏరియల్స్ కూడ చెల్లిస్తున్నామని తెలిపారు. దరలు పెంచేందుకు కారణం కూడ కేంద్ర ప్రభుత్వమే నన్నారు. పెట్రోల్, గ్యాస్, డిజిటల్, నిత్యవసర సరుకుల దరలు పెంచి సామన్య ప్రజల నడ్డివిరిచే ప్రయత్నం బీజేపి ప్రభుత్వం చేస్తుందన్నారు. ఆదానీ అంభానీ లాంటి ప్రైవేటు వ్యక్తులు వ్యాపారంలో నష్టపోతే వారికి సహకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఎకంగా 12 లక్షల కోట్ల రూపాయల బాకీలను మాపీ చేసి కార్పోరేట్ శక్తులకు సహకరిస్తున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పాలకులు తప్పుడు ప్రచారాలు చేస్తూ… బ్రతకడం తప్పా… వారు ప్రజల మద్యకు రాక ప్రజల సమస్యలు పరిష్కరించరని తెలిపారు. కార్మీకులకు తెలంగాణ ప్రభుత్వం ఎల్లవేలలా అండగా ఉంటుందని… కార్మీకులప ఎవరు అదౌర్య పడవద్దని తెలిపారు. కార్మీకుల సంక్షేమం కోసమే మా ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. నగరంలో ఆటో ట్రాలీ యూనియన్ వారు కోరినట్లుగా వారి సమస్యలన్ని పరిష్కరిస్తామన్నారు.

మంత్రి గంగుల కమలాకర్, పెద్దలు వినోద్ కుమార్ల దృష్టికి తీసుకెల్లి అన్ని రంగాల్లో ఉన్న కార్మీకుల సమస్యలన్ని పరిష్కరిస్తామన్నారు. ఆటో ట్రాలీ యూనియన్ కు సంబంధించిన నగరంలో ఎన్ని అడ్డాలున్నా నగరపాలక సంస్థ ద్వారా వారు కూర్చోవడానికి ప్రత్యేక సీటింగ్ సౌకర్యాలు కల్పిస్తామన్నారు. వివిధ రంగాల్లో కార్మికులు చనిపోతే ప్రభుత్వ పరంగా 5 లక్షల రూపాయలు ప్రమాద బీమా అందించేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెల్లి భీమా అందించే ప్రయత్నం తప్పకుండ చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజలు, కార్మీకుల సంక్షేమం కోసం పరితపిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ చేతులను రాబోయే రోజుల్లో ఇంకా బలోపేతం చేయాలి. మన సంక్షేమం కోసం ప్రభవత్వానికి మనమంతా అండగా నిలవాలని పిలుపు నిచ్చారు.

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నగర అద్యక్షులు చల్ల హరిశంకర్, ఆటో ట్రాలీ యూనియన్ గౌరవ అద్యక్షులు, బీఆర్ఎస్ నాయకులు ఎడ్ల అశోక్, బీఆర్ఎస్ కార్పోరేటర్ కంసాల శ్రీనివాస్ మరియు వివిధ కార్మీక సంఘాల అద్యక్షులు, నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *