ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రధాని మోదీ, గవర్నర్ తమిళిసై బర్త్ డే విషెస్..!

- సీఎం కేసీఆర్ కు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ, గవర్నర్ తమిళిసై, చిరంజీవి, పవన్ కళ్యాణ్, అరవింద్ కేజ్రీవాల్, మహేష్ బాబు
- ఘనంగా కేసీఆర్ పుట్టినరోజు.. రాష్ట్రవ్యాప్తంగా సంబురాలు
హైదరాబాద్, పిబ్రవరి 17 (విశ్వం న్యూస్) : రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి దళపతి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు జన్మదిన వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా సందడిగా సాగాయి. పల్లె, పట్టణం అనే తేడా లేకుండా.. ఉత్సవాల్లో ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొని హోరెత్తించారు. అభిమాన నేతకు తమదైన రీతిలో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.





