ఖమ్మం సభను విజయవంతం చేయాలి : సత్యవతి రాథోడ్‌

ఖమ్మం సభను విజయవంతం చేయాలి : సత్యవతి రాథోడ్‌

హైదరాబాద్, జనవరి 16 (విశ్వం న్యూస్) : ఈనెల 18న ఖమ్మంలో జరిగే బీఆర్‌ఎస్‌ ఆవిర్భావ సభను విజయవంతం చేయాలని గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కేసముద్రంలో బీఆర్‌ఎస్‌ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి మాట్లాడుతూ మహబూబాబాద్ జిల్లా నుంచి లక్షల మంది తరలివెళ్లేలా అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశామన్నారు. ఖమ్మం బహిరంగ సభకు కేరళ, పంజాబ్‌, ఢిల్లీ ముఖ్యమంత్రులు విజయన్‌, భగవంత్‌ సింగ్‌ మాన్‌, అరవింద్‌ కేజ్రీవాల్‌, ఎస్పీ పార్టీ అధినేత, యూపీ మాజీ సీఎం అఖిలేశ్‌ యాదవ్‌, సీపీఐ ప్రధాన కార్యదర్శి డీ రాజా తదితర ప్రముఖులు హాజరవుతారన్నారు. ఖమ్మం సభ ద్వారా రాష్ట్రానికి దిశా, దేశానికి సీఎం కేసీఆర్‌ గారు నిర్దేశం చేస్తారన్నారు.

తేదీ 18.1.2023 – ఖమ్మంలో బీఆర్ఎస్ బహిరంగ సభ షెడ్యూల్ :
• తేదీ : 17.1.2023 రాత్రికి జాతీయ నేతలంతా హైదరాబాద్‌కు చేరుకుంటారు.
• యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్‌ యాదవ్‌ గారికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు స్వాగతం పలుకుతారు.
• ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ గారికి, పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ గారికి మంత్రి మహమూద్‌ అలీ గారు స్వాగతం చెబుతారు. ప్రొటోకాల్ చూస్తారు.
• కేరళ సీఎం పినరయి విజయన్ గారికి మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి గారు,
• సీపీఐ జాతీయనేత డి.రాజాకు – బీఆర్ఎస్ నేత దాసోజు శ్రావణ్‌ స్వాగతం స్వాగతం పలుకుతారు.
• తేదీ 18.1.2023 ఉదయం జాతీయ నేతలంతా సీఎం కేసీఆర్ గారితో బ్రేక్‌ఫాస్ట్‌ చేస్తారు. అనంతరం వారంతా దేశ రాజకీయాలపై చర్చిస్తారు.
• ఆ తర్వాత సీఎం కేసీఆర్ గారితో కలిసి వారంతా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శనం చేసుకుంటారు.
• యాదాద్రి నుంచి రెండు హెలీకాప్టర్లలో ఖమ్మంకు బయలుదేరుతారు.
• నేరుగా సీఎం కేసీఆర్‌ గారితో కలిసి వారంతా ఖమ్మం కలెక్టరేట్‌ చేరుకొని, రాష్ట్రంలో చేపట్టే రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.
• ఖమ్మం సభా వేదిక ముందు ప్రధాన నాయకులకు ప్రత్యేక సెక్టార్‌ ఉంటుంది.
• మంత్రులు, బీఆర్ఎస్ నాయకులు సభావేదిక ముందు ఆసీనులవుతారు.
• సీఎం కేసీఆర్‌ గారితో సభా వేదికపై ఉమ్మడి ఖమ్మం జిల్లా నేతలే ఉంటారు.
• 18వ తేదీ మ. 2 నుంచి సా. 5 గంటల వరకు బహిరంగ సభ జరుగుతుంది.
• ఖమ్మం బహిరంగ సభను విజయవంతం చేయాలి : మంత్రి సత్యవతి రాథోడ్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *