దేశానికి అన్నపూర్ణగా తెలంగాణ : మంత్రి తలసాని

హైదరాబాద్, జనవరి 16 (విశ్వం న్యూస్) : సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ, దేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణగా మారిందని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆదివారం పీవీ మార్గ్ లోని పీపుల్స్ ప్లాజాలో నిర్వహించిన సంక్రాంతి వేడుకల్లో మంత్రి తలసాని మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంతో రాష్ట్రం సస్యశ్యామలంగా మారిందని, పంటలు విస్తారంగా పండుతున్నాయని మంత్రి తెలిపారు.