Today TrendingVishwam Newsఆంధ్రప్రదేశ్తాజా వార్తలుతెలంగాణహైదరాబాద్

కారును ఢీకొన్న లారీ.. ఇద్దరు డీఎస్పీలు మృతి

కారును ఢీకొన్న లారీ..
ఇద్దరు డీఎస్పీలు మృతి

హైదరాబాద్, జూలై 26 (విశ్వం న్యూస్) : నల్గొండ జిల్లా చౌటుప్పల్ మండలం కైతపురం వద్ద శనివారం తెల్లవారుజామున జాతీయ రహదారిపై దారుణ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వెళ్తున్న లారీ, ఏపీకి చెందిన పోలీసు అధికారులు ప్రయాణిస్తున్న కారును వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు డీఎస్పీలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

మృతులు ఏపీకి చెందిన డీఎస్పీ చక్రధరరావు, శాంతారావులుగా గుర్తించబడారు. తీవ్ర గాయాలపాలైన అడిషనల్ ఎస్పీ ప్రసాద్‌ను, కారు డ్రైవర్ నర్సింగరావును చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.

పోలీసుల వివరాల ప్రకారం, వారు విజయవాడ నుంచి హైదరాబాద్‌కు వస్తుండగా మార్గమధ్యంలో ఈ దుర్ఘటన జరిగింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ప్రమాదంతో ఆ ప్రాంతంలో తీవ్ర విషాదం అలుముకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *