Today TrendingVishwam Newsతాజా వార్తలుతెలంగాణహైదరాబాద్

ఘోర రోడ్డు ప్రమాదం:బైక్‌ను లారీ ఢీ.. తండ్రి, కుమార్తె మృతి

ఘోర రోడ్డు ప్రమాదం: బైక్‌ను లారీ ఢీ..
తండ్రి, కుమార్తె మృతి

హైదరాబాద్, జూలై 26 (విశ్వం న్యూస్) : రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌ చౌరస్తాలో శనివారం ఉదయం ఓ హృదయవిదారక ఘటన జరిగింది. బైక్‌పై వెళ్తున్న తండ్రి–కుమార్తెను ట్యాంకర్‌ లారీ ఢీకొట్టి గాలిలోకి ఎగిరినట్లు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో తండ్రి అక్కడికక్కడే మృతి చెందగా, కుమార్తె తీవ్ర గాయాలచే ఆసుపత్రిలో కన్నుమూసింది.

పోలీసుల కథనం ప్రకారం… షాద్‌నగర్‌కు చెందిన మచ్చేందర్‌ తన కుమార్తె మైత్రిని బస్టాప్‌ వరకు తీసుకెళ్లేందుకు బైక్‌పై బయలుదేరాడు. మైత్రి శంషాబాద్‌లోని వర్ధమాన్‌ కళాశాలలో బీటెక్‌ చదువుతోంది. షాద్‌నగర్‌ చౌరస్తా వద్దకు రాగానే వీరి ద్విచక్రవాహనాన్ని వేగంగా వచ్చిన ట్యాంకర్‌ లారీ ఢీకొట్టింది.

ప్రమాదంలో మచ్చేందర్‌ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మైత్రి లారీ టైర్ల మధ్య ఇరుక్కుపోయి తీవ్ర గాయాలతో విలవిలలాడింది. “కాపాడండి.. ఫోన్ చేయండి” అంటూ ఆమె చేసిన ఆర్తనాదాలు అక్కడున్నవారిని కంటతడి పెట్టించాయి. చివరికి తన మొబైల్‌ను సమీపంలోని వ్యక్తికి ఇచ్చి, కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వమని వేడుకుంది. అదే సమయంలో స్నేహితురాలికి వస్తున్న కాల్‌కి స్పందించిన స్థానికులు ప్రమాద వివరాలను తెలియజేసారు.

అయితే, చికిత్సకి తరలించేలోపు మైత్రి కూడా మృతిచెందింది. ఈ విషాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం షాద్‌నగర్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *