ప్రియాంకా గాంధీ సభను
విజయవంతం చేయండి

కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు పత్తి కృష్ణారెడ్డి
జమ్మికుంట, మే 7 (విశ్వం న్యూస్) : ఈ నెల 8 తేది హైదరాబాద్ సరూర్ నగర్ లో ఏర్పాటు చేస్తున్న ‘విద్యార్థి నిరుద్యోగ గర్జన’ కు నియోజక వర్గం నుండి భారీ స్థాయిలో యువకులు రావాలని కాంగ్రెస్ కిసాన్ సెల్
జిల్లా అధ్యక్షులు పత్తి కృష్ణారెడ్డి పిలుపు నిచ్చారు.
జమ్మికుంట పట్టణంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ యువత తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలర్పించారని, అటువంటి యువత తెలంగాణ ఏర్పడ్డాక తమకు ఉద్యోగాలు వస్తాయని ఎన్నో ఆశలు పెట్టుకున్నపటికి సి.ఎం కే.సి.అర్ నియంతృత్వ పోకడలతో వారి ఆశలు అడియాశలు అయ్యాయని ఆరోపించారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్థే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఏ విధంగా విధానం రూపొందిస్తాం అనే కార్యాచరణపై అభయం కల్పించేందుకు కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకురాలు శ్రీమతి ప్రియాంకాగాంధీ హైదరాబాద్ రానున్న నేపథ్యంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగసభకు యువత , కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలి వచ్చి సభను విజయవంతం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పుల్లురి సదానందం, పట్టణ అధ్యక్షురాలు పుదరి రేణుక, నియోజక వర్గ సీనియర్ నాయకులు కనుమల్ల రామకృష్ణ, చిట్యాల శంకర్, ఎన్.ఎస్.యు.ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇమ్రాన్, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు సుంకరి రమేష్, సలీం, సీనియర్ నాయకులు ఎగ్గని శ్రీనివాస్, పుధరి శివ, పింగలి రాకేష్, నాయకులు హరీష్ రెడ్డి, కొలిపాక శంకర్, మేకల తిరుపతి, బొమ్మ శ్రీనివాస్, పోతుల శ్రీను, చంచల శ్రీను, కోడెం శ్రీను, తసీఫ్, పర్వేష్, సిలివేరి రాజమౌళి, ముధ్తమల్ల రవి, మండ అశోక్, వినోద్ రెడ్డి, మేకల సురేష్, ముడేత్తుల మల్లేశం, గంగారపు మహేష్, గోరుబాయ్, చెరుకు సంపత్ తదితరులు పాల్గొన్నారు.