మంచు ఇంట పెండ్లి సందడి: ఘనంగా మంచు మనోజ్-మౌనిక వివాహం
హైదరాబాద్, మార్చి 4 (విశ్వం న్యూస్) : మంచు మనోజ్-భూమా మౌనిక వివాహం గత రాత్రి ఘనంగా జరిగింది. హైదరాబాద్ ఫిలింనగర్‌లోని మంచు లక్ష్మి నివాసంలో గత రాత్రి 8.30 గంటల సమయంలో మౌనిక మెడలో మనోజ్ మూడుముళ్లు వేశాడు. ఈ వేడుకకు దగ్గరి బంధువులు, ఇరు కుటుంబ సభ్యులు హాజరయ్యారు.