ప్రజలకు అండగా నేనున్నా: సర్పంచ్ కనపర్తి వంశీధర్

ప్రజలకు అండగా నేనున్నా: సర్పంచ్ కనపర్తి వంశీధర్

  • సేవే మార్గం, అభివృద్ధే లక్ష్యం
  • సరికొత్త మార్గాల్లో అభివృద్ధి పయనం
  • అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న జగ్గయ్యపల్లి యువ సర్పంచ్

జమ్మికుంట, మార్చి 4 (విశ్వం న్యూస్) : అభివృద్ధి విషయంలో రాజీ పడే ఉద్దేశం లేదనీ జగ్గయ్యపల్లి సర్పంచ్ కనపర్తి వంశీధర్ మరోసారి నిరూపించుకున్నారు. సర్పంచ్ గా ఎన్నికైన నాటి నుండి అనేక అభివృద్ధి పనులు చేయడమే కాకుండా పేద ప్రజలకు కష్టం వచ్చినా ప్రతీసారి అండగా నేనున్నా అంటూ నిరూపిం చుకున్న ఘటనలు అనేకం. గ్రామంలో ఏదైనా సమస్య తన దృష్టికి వచ్చిన వెంటనే పరిష్కరించడం అతని నైజం. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగి ఉన్న తండ్రి పేరును కాపాడటమే కాకుండా నమ్ముకున్న కార్యకర్తలకు ఎల్లప్పు డూ అండగా ఉండటం, చేసే పనిలో నిబద్దత ఆయన సొంతం. సర్పంచ్ గా ఎన్నికైన నాటి నుండి గ్రామంలో చాలా వరకు మార్పు, వివిధ వర్గాలను ఒప్పించి, మెప్పించి పని చేయడం, గ్రామ ప్రజలకు అన్ని వర్గాల్లో సముచిత స్థానం కల్పించడంలో విశేష కృషి మరువలేనిది. గ్రామ అభివృద్ధి విషయం పాలక వర్గం సహాయ, సహకారాలు మరువలేనివి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *