బీజేపీ జిల్లా కార్యదర్శిగా మారం తిరుపతిరెడ్డి నియామకం

వీణవంక, ఏప్రిల్ 2 (విశ్వం న్యూస్) : వీణవంక మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా జిల్లా కార్యదర్శిగా హిమ్మత్ నగర్ గ్రామానికి చెందిన మారం తిరుపతి రెడ్డి ని నియమించడం జరిగింది. ఈ నియామక పత్రాన్ని అందుకుంటూ నాయొక్క నియామకానికి సహకరించినటువంటి రాష్ట్ర అధ్యక్షులు, అలాగే స్థానిక శాసనసభ్యులు, జిల్లా అధ్యక్షులకు జిల్లా కార్యదర్శి, అసెంబ్లీ కన్వీనర్, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు, మండల అధ్యక్షులు, మరియు మిత్రులకు, శ్రేయోభిలాషులకు, కృతజ్ఞతలు తెలియజేశారు. నాపై నమ్మకంతో ఇచ్చిన పదవికి తగు న్యాయం చేస్తానని మారం తిరుపతి రెడ్డి తెలిపారు.