గీత కార్మికులను పరామర్శించిన మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్

నాగోల్, మార్చి 18 (విశ్వం న్యూస్) : రాష్ట్ర ఎక్సైజ్, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు, యువజన సర్వీసుల శాఖల మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ హైదరాబాదులోని నాగోల్ లో గల సుప్రజా ఆసుపత్రిలో తాటి చెట్టు పై నుండి ప్రమాదవశాత్తు జారిపడి తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న సూర్యాపేట జిల్లా నాగారం కు చెందిన బాలగోని నారాయణ గౌడ్ S/o వెంకటయ్య గౌడ్ , రంగారెడ్డి జిల్లా మాడుగుల మండలం సద్దుపల్లి గ్రామానికి చెందిన పందుల లక్ష్మయ్య గౌడ్ తండ్రి పెద్దయ్య లను సుప్రజా ఆసుపత్రిలో పరామర్శించారు.

ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి డా.వి. శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ గీత కార్మికులు ప్రమాదవశాత్తు తాటి, ఈత చెట్టు పై నుండి ప్రమాదవశాత్తు పడి తీవ్ర గాయాలు, గాయాల పాలై వివిధ ఆసుపత్రి లలో చికిత్స పొందుతున్న గీత కార్మికులకు వైద్య సహాయానికి అవసరమైన ఖర్చులను ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి అందిస్తామన్నారు. ప్రమాదవశాత్తు తాటి ఈత చెట్లపై పడి చికిత్స పొందుతున్న గీత కార్మికులు తన కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. ఈ సందర్భంగా గీత కార్మికులు గీత వృత్తిలో భాగంగా తాటి, ఈత చెట్లపై ప్రమాదవశాత్తు పడి తీవ్ర గాయాలైన గీత కార్మికులకు నాగోల్ లోని సుప్రజా ఆసుపత్రి MD డాక్టర్ విజయ్ గౌడ్ ఉచితంగా వైద్య సహాయాన్ని అందిస్తున్న సందర్భంగా మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ అభినందించారు. గీత కార్మికులకు ఉచితంగా వైద్యాన్ని అందిస్తున్న డాక్టర్ విజయ్ గౌడ్ కు ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా అండగా నిలుస్తామన్నారు.