అసెంబ్లీలో జబర్దస్త్ జోకులు వేస్తున్న మంత్రి మల్లారెడ్డి
మేడ్చల్ లో డిగ్రీ కళాశాల గురించి మాట్లాడు:ఎస్ఎఫ్ఐ
హైదరాబాద్, ఫిబ్రవరి 11 (విశ్వం న్యూస్) : ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాథోడ్ సంతోష్ మాట్లాడుతూ మేడ్చల్ లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని అనేక సంవత్సరాల నుంచి విద్యార్థులు, భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ గా పోరాటాలు చేస్తున్న పట్టించుకోని పాలకులు.. మేడ్చల్ నియోజకవర్గంలో మండలాన్ని ఒక్క జూనియర్ కళాశాల ఏర్పాటు చేస్తామని మేడ్చల్ లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తామని నియోజవర్గం ఎమ్మెల్యే ప్రస్తుతం కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి హామీ ఇచ్చారు. ఈ హామీల గురించి అసెంబ్లీలో మాట్లాడుతారేమో అని వేయికళ్లతో, కోటి ఆశలతో ఎదురుచూసిన విద్యార్థిని, విద్యార్థులు, నియోజవర్గ ప్రజలు కానీ మంత్రి మల్లారెడ్డి విద్యార్థినీ విద్యార్థుల నియోజకవర్గాల్లో ఉన్న సమస్యల్ని మర్చిపోయి. తన వ్యక్తిగత కళాశాల మల్లారెడ్డి విద్యాసంస్థల గురించి అసెంబ్లీలో కూడా మాట్లాడడం సిగ్గుచేటు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ఉన్న నియోజకవర్గాల ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గ సమస్యల గురించి మాట్లాడుతుంటే మంత్రి మల్లారెడ్డి మాత్రం మేడ్చల్ నియోజకవర్గం సమస్య గురించి ఒక మాట కూడా ఎత్తకపోవడం సరైన విధానం కాదు మేడ్చల్ లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయకపోతే, మేడ్చల్ నియోజవర్గాల్లో ప్రతి మండలంలో ఒక్క జూనియర్ కళాశాల ఏర్పాటు చేయకపోతే కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డిని అడుగున అడ్డుకుంటామని భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐగా హెచ్చరిస్తున్నాము.