రేకుర్తి ప్రజల బాధలు వర్ణనాతీతం

రేకుర్తి ప్రజల బాధలు వర్ణనాతీతం

త్రాగునీరు లేదు, రోడ్లు మురికి కాలువలు లేవు
నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి

కరీంనగర్, ఫిబ్రవరి 11 (విశ్వం న్యూస్) : హాత్ సే హాత్ జోడో పాదయాత్ర రేకుర్తి 18 వ డివిజన్ లో కొనసాగింది, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి తో పాటు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ రేకుర్తి గ్రామం కార్పొరేషన్ లో విలీనమైనప్పటికీ ఇప్పటికీ పెంటకమ్మ చెరువు నీరుపైనే ఆధారపడి త్రాగునీరుకు నోచుకోలేని దుస్థితి ఉందని పేర్కొన్నారు. వరదనీటితోపాటు మురికినీరు ఎక్కడికక్కడ నిలిచి ఉండడం వల్ల దుర్వాసన వెదజల్లుతోందనీ దోమలు స్వైరవిహారం చేస్తున్నాయన్నారు.

రోడ్లులేవు మురికి కాలువలులేవు అద్వాన్నమైన పరిస్థితి ఉందని కోమటిరెడ్డి అన్నారు. గడప గడపకు వెళ్లి ప్రజలతో మాట్లాడుతూ పాదయాత్ర గురించి వివరిస్తూ వారి సమస్యలను తెలుసుకుంటూ డివిజన్ మొత్తం పర్యటించారు. బాలబద్రి శంకర్, ఎండి చాంద్ ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టారు. ఈ కార్యక్రమంలో మడ్లపల్లి శ్రీనివాస్, ఎం డి బషీరొద్దిన్, గుండాటీ శ్రీనివాస్ రెడ్డి, కుర్ర పోచయ్య, జీడీ రమేష్, సలిమొద్ధిన్, షబానా మహమ్మద్, ఉరడి లత, ముల్కల కవిత, కీర్తి కుమార్, షేక్ శేహెన్ష, నదీo, అజ్మత్, హనీఫ్, భారీ,మెతుకు కాంతయ్య, జాఫర్, ఆశ్రఫ్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *