మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
రేవంత్ రెడ్డికి క్షమాపణ చెప్పాలి
పిసిసి అధ్యక్షున్ని పిస్కుతే
ప్రాణంపోతది అంటారా ఖబర్ధార్
నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి
కరీంనగర్ బ్యూరో, మే 10 (విశ్వం న్యూస్) : మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ రేవంత్ రెడ్డి పై చేసిన వాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పాలని నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి డిమాండ్ చేశారు.నగర కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ క్యాబినెట్ మంత్రి అయి ఉండి పిస్కుతె ప్రాణం పోతది అని వీధిరౌడీలా మాట్లాడుతున్నారని అన్నారు. వాఖ్యలు వెనక్కి తీసుకోక పోతే ఉర్కునేది లేదని హెచ్చరించారు.
ఈ విలేకరుల సమావేశంలో కీర్తి కుమార్,నెల్లి నరేష్, షేహెన్ష,గాదె సాయిరాం,అశ్రఫ్ ఖురేషి, శాయిద్ అఫ్రిది, ఆంజనేయులు తది తరులు పాల్గొన్నారు.