అభాగ్యులకు అండగా మొలుగూరి సదయ్య

అభాగ్యులకు అండగా
మొలుగూరి సదయ్య

  • ఆర్థిక సహాయం పాటు 50 కిలోల బియ్యం అందజేత
  • ఈ కుటుంబానికి ఆర్థికంగా సహాయం చేయాలనీ విన్నపం

జమ్మికుంట, ఏప్రిల్ 16 (విశ్వం న్యూస్) : జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలో గల బీసీ హాస్టల్ వెనుక వైపున గత 30 సంవత్సరాలుగా నివసిస్తున్న మాదాడి ప్రేమలత వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఎదో మా వంతుకు సహాయం చేయడం జరిగింది. బియ్యం ఎక్కడ ఇచ్చినా చెప్పకోము. కానీ ఇక్కడి పరిస్థితి మా సహాయంతోనే కాకుండా ఎవరైనా కనీసం బియ్యం ఐనా వీరికి ఇస్తారని, ముందుగా మేమే మాకు తోచిన సహాయంతో పాటు 50 కిలోల బియ్యాన్ని మొలుగూరి సదయ్య, కాంగ్రెస్ పార్టీ మాజీ పట్టణ అధ్యక్షులు మరియు డాక్టర్ అశోక్ పండ్లు పంపిణీ చేయడం జరిగింది.

వారు గతంలో మరిపెళ్లి గూడెం గ్రామంనుండి జమ్మికుంటకు వలస వచ్చి నివాసం ఏర్పరచుకున్నారు. మాదాడి ప్రేమలత భర్త నరసింహారెడ్డి అనారోగ్యంతో చనిపోయారు. వారికి ఒక కూతురు స్రవంతి కలదు ఆమె బిఈడి, ఎంబీఏ చదువు పూర్తి చేసి ఉన్నది. ఆమెను మహబూబాబాద్ దగ్గర ఎరిజర్ల గ్రామానికి చెందిన నారాయణ రెడ్డితో వివాహం జరిగినది. స్రవంతి మరియు నారాయణరెడ్డికు కూతురు రహిమాన్విత కలదు ఆమె ప్రస్తుతం జమ్మికుంట ప్రైవేట్ స్కూల్లో ఏడవ తరగతి చదువుతోంది. ఆమె చదువు నిమిత్తం ఖర్చులకు కూడా ఇబ్బంది అవుతుందని తెలిపినారు.

అందుకు కూడాతోడ్పాటు ప్రయత్నిస్తూ, మాదాడి ప్రేమలత కూతురు స్రవంతి ప్రస్తుతం భర్తతో దూరం ఉంటుంది. ఆమెకు ఏదో తెలియని మానసిక రోగంతో ఆమె రూమ్ కు మాత్రమే పరిమితమై బయటకు రాకుండా ఉంటుంది. వారి ఆర్థిక పరిస్థితులు చూసి వారికి సహాయం చేయడం జరిగింది. కావున జమ్మికుంట పురపాలక సంఘం పరిధిలో నివసించే పెద్దలు, మేధావులు మరియు ఇతర వర్గాలు మాదాడి ప్రేమలత గారి కుటుంబానికి ఆర్థికంగా సహాయం చేసి మనోధైర్యం ఇవ్వాల్సిందిగా పట్టణ ప్రముఖులను కోరుతున్నాము. ఈ కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది- కాంగ్రెస్ పార్టీ మాజీ పట్టణ అధ్యక్షులు మొలుగూరి సదయ్య మరియు డాక్టర్ అశోక్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *