రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేయాలి

వీణవంక, జూన్ 13 (విశ్వం న్యూస్) : ఈరోజు వీణవంక మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు ఎండి సాహెబ్ హుస్సేన్ మాట్లాడుతూ ఐకెపి సెంటర్ల ద్వారా సహకార సంఘాల ద్వారా రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసి రెండు మాసాలు అవుతున్న రైతులకు డబ్బులు వారి ఖాతాలో జమ వేయకపోవడం మరియు ఐకెపి సెంటర్లో తూకాల్లో మోసాలు చేసి అమ్ముకున్న ధాన్యానికి వెంటనే రైతుల ఖాతాలో డబ్బులు వేయాలని అకాల వర్షం పడినందువలన యాసంగి పంటకు వరి, మొక్కజొన్న, మిర్చి, నేలపాలై పంట నష్టం జరిగింది ప్రభుత్వ అధికారులు పర్యవేక్షణ చేసి పంట నష్టాన్ని గుర్తించినారు ముఖ్యమంత్రి మరియు రాష్ట్ర మంత్రులు, పరిశీలించి ఎకరానికి పదివేల రూపాయలు ఇస్తానని చెప్పి ఇప్పటివరకు ఇవ్వలేకపోవడం పట్ల రాష్ట్ర రైతాంగాన్ని మోసం చేస్తు ముసలి కన్నీరు కాస్తున్న ఈ బిఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వాని గద్దె దింపే వరకు రైతాంగం పట్ల కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని రైతులకు డబ్బులు వెంటనే వారి వారి ఖాతాలో జమ చేయాలని లేని ఎడల కాంగ్రెస్ పార్టీ పక్షాన పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు తెలియజేస్తామని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గంగాడి రాజిరెడ్డి, చదువు జైపాల్ రెడ్డి, జున్ను తుల మధుకర్ రెడ్డి, వడ్డేపల్లి కొమురయ్య, ఈదునూరి పైడి కుమార్, గుంపుల గట్టయ్య, ఎండి రజాక్, ఎండి సలీం ఎండి అన్వర్, తదితరులు పాల్గొన్నారు.