Today TrendingVishwam Newsతాజా వార్తలుతెలంగాణహైదరాబాద్

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల

  • ఫిబ్రవరి 11న పోలింగ్,
    13న ఫలితాలు

హైదరాబాద్, జనవరి 27, 2026 (విశ్వం న్యూస్) : తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు నగారా మోగింది. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి రాణి కుముదిని 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలకు సంబంధించిన ఎన్నికల షెడ్యూల్‌ను అధికారికంగా ప్రకటించారు. ఈ ప్రకటనతో ఎన్నికలు జరిగే అన్ని పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ తక్షణమే అమల్లోకి వచ్చింది.

మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల స్వీకరణ జనవరి 27 నుంచి 30 వరకు కొనసాగనుంది. జనవరి 31న నామినేషన్ల స్క్రూట్నీ నిర్వహించనుండగా, ఫిబ్రవరి 3న నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగియనుంది. ఫిబ్రవరి 11న ఒకే విడతలో పోలింగ్ జరగనుండగా, అవసరమైతే ఫిబ్రవరి 12న రీపోలింగ్ నిర్వహించనున్నట్లు ఎన్నికల కమిషన్ వెల్లడించింది. ఫిబ్రవరి 13న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటించనున్నారు. ఎన్నికలు బ్యాలెట్ విధానంలో నిర్వహించబడతాయి.

ఈ ఎన్నికల్లో మొత్తం 52.43 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2996 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. మున్సిపాలిటీల్లో చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్ ఎన్నికలు ఫిబ్రవరి 16న జరగనున్నాయి. అదే విధంగా 7 కార్పొరేషన్లలో మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు కూడా అదే రోజు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.

ఎన్నికలు పారదర్శకంగా, శాంతియుత వాతావరణంలో జరిగేలా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి స్పష్టం చేశారు. పోలీస్ శాఖతో సమన్వయం చేసుకుంటూ సమస్యాత్మక ప్రాంతాల్లో గట్టి భద్రత ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మున్సిపల్ ఎన్నికలతో రాష్ట్ర రాజకీయాల్లో మళ్లీ ఉత్కంఠ వాతావరణం నెలకొననుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *