కరీంనగర్

మున్నూరు కాపులు రాజకీయంగా ఎదగాలి: ఎమ్మెల్యే గంగుల కమలాకర్

మున్నూరు కాపులు రాజకీయంగా
ఎదగాలి: ఎమ్మెల్యే గంగుల

కరీంనగర్, జూలై 18 (విశ్వం న్యూస్) : తెలంగాణలో మున్నూరు కాపులు అన్ని రంగాల్లోనూ వెనుకబడిపోయారని, రాజకీయంగా ఎదగాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. శుక్రవారం కరీంనగర్‌లో మున్నూరు కాపు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రామ, పట్టణ అధ్యక్షుల విస్తృతస్థాయి సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా గంగుల మాట్లాడుతూ… ‘‘రాష్ట్రంలో జరుగుతున్న కులగణనలో మున్నూరు కాపుల సంఖ్యపై స్పష్టత లేదు. గ్రామాల వారీగా లెక్కలు తీసి మేమే ప్రభుత్వానికి అందిస్తాం. ఇటీవలి కాలంలో మున్నూరు కాపులకు చెందిన ఉద్యోగులపై ఏసీబీ దాడులు జరుగుతున్నాయి. కక్ష సాధింపుగా కొందరిని జైలుకు పంపిస్తున్నారు. మున్నూరు కాపులు వాస్తవానికి వెనుకబడిన కులమే. కానీ అవకాశాల లోపంతో మేము తలదించుకోవాల్సి వస్తోంది’’ అని వ్యాఖ్యానించారు.

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ వర్గానికి చెందిన వారు ముందుకు రావాలని, ఐక్యతతో నిలవాలని పిలుపునిచ్చారు. ‘‘మున్నూరు కాపులు రాజకీయాలను శుద్ధి చేసే స్థాయికి ఎదగాలి’’ అని ఆకాంక్షించారు.

సమావేశంలో ప్రభుత్వం చేపట్టిన కులగణనను పూర్తిగా బహిర్గతం చేయాలన్న తీర్మానం ఆమోదించబడింది. అలాగే మంత్రివర్గంలో మున్నూరు కాపులకు ప్రాతినిధ్యం కల్పించాలి, ఉద్యోగులపై దాడులను నిలిపివేయాలి, కాచిగూడ మున్నూరు కాపు వసతి గృహాన్ని ప్రభుత్వ ఆధీనంలోనుంచి ట్రస్ట్‌ అధీనంలోకి అప్పగించాలి అనే డిమాండ్లు చేయడం జరిగింది.

పాల్గొన్న నాయకులు:
గ్రంథాలయ చైర్మన్ సత్తు మల్లేశం, రాష్ట్ర మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు సర్దార్ పుట్టం పురుషోత్తం రావు పటేల్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్లు చల్ల హరిశంకర్, జెన్ వెంకట్, బుక్క వేణుగోపాల్, జిల్లా గౌరవ అధ్యక్షుడు గంగుల సుధాకర్, జిల్లా అధ్యక్షుడు బొమ్మ రాధా కిషన్, ప్రధాన కార్యదర్శి నలువాల రవీందర్, ఉపాధ్యక్షులు కర్ర రాజశేఖర్, పురుమళ్ళ శ్రీనివాస్, బొమ్మ రాత్రి రాజేశం, జర్నలిస్టు ఫోరం అధ్యక్షుడు పోతగాని శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి కొల్ల వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.

ఇంకా హాజరైన వారు:
నియోజకవర్గ కోఆర్డినేటర్లు మడ్లపల్లి శ్రీనివాస్, గంప వెంకన్న, పొనుగంటి మల్లయ్య, గాజుల వెంకటేశ్వర్లు, ఇన్‌చార్జులు ముప్పిడి సునీల్, సత్తినేని శ్రీనివాస్, బొల్లం లింగమూర్తి, దామెరకొండ సంతోష్, బండి దీపక్ ప్రశాంత్, ఎంపీటీసీ, డాక్టర్లు, అడ్వకేట్ అసోసియేషన్ల అధ్యక్షులు, కార్యదర్శులు, గ్రామ–మండల సంఘాల ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *