హైదరాబాద్

గంధంగూడలో వాటర్ ప్లాంట్‌పై ప్రజల ఆందోళన

గంధంగూడలో వాటర్
ప్లాంట్‌పై ప్రజల ఆందోళన

  • ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ గారికి వినతిపత్రం

హైదరాబాద్, జూలై 17 (విశ్వం న్యూస్): గంధం గూడ పరిధిలోని 86 సర్వే నంబర్లలో ఏర్పాటు కావాల్సిన వాటర్ ప్లాంట్‌పై ప్రజల ఆందోళన పై స్థానిక ప్రజలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ నివాస ప్రాంతం మధ్యలో అలాంటి ప్లాంట్ ఏర్పాటవుతుందన్న సమాచారంతో తరుణులు, స్థానిక ప్రతినిధులు కలిసి స్థానిక ఎమ్మెల్యే గారిని కలిసి వినతిపత్రం అందజేశారు.

ప్రజల ఆందోళనపై ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ గారు సానుకూలంగా స్పందించి, తక్షణమే ఎమ్మార్వో గారితో పాటు కలెక్టర్ గారితో ఫోన్‌లో సంప్రదించి విషయం వివరించారు. జనావాసాల మధ్యలో ఆ ప్లాంట్ ఏర్పాటుకు అవసరం లేదని, ప్రజల అభిప్రాయాన్ని గౌరవించాలని సూచించారు. ప్రజల శాంతి, భద్రతలకు భంగం కలిగించే విధంగా ఏ నిర్ణయం తీసుకోకూడదని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పూలంపల్లి కృష్ణారెడ్డి, తలారి ప్రేమ్ కుమార్, లక్ష్మిబాయి, సురేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రాంత ప్రజల మనోభావాలకు అనుగుణంగా స్పందించిన ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *