Vishwam Newsకరీంనగర్తెలంగాణ

మృతుని కుటుంబానికి 50 కిలోల బియ్యం అందజేసిన జాతీయ కళా రత్న అవార్డు గ్రహీత అంబాల ప్రభాకర్

మృతుని కుటుంబానికి 50 కిలోల బియ్యం అందజేసిన జాతీయ కళా రత్న అవార్డు గ్రహీత అంబాల ప్రభాకర్

భవిష్యత్తులో వారి కుటుంబానికి అండగా ఉంటానని హామీ
జమ్మికుంట, ఫిబ్రవరి 3 (విశ్వం న్యూస్) : జమ్మికుంట మండలం మడిపల్లి గ్రామానికి చెందిన జన్నే భద్రయ్య గత నెల 20వ తేదీన తన వ్యవసాయ భూమి వద్ద పనులు ముగించుకొని వస్తుండగా మడిపల్లి కనపర్తి గ్రామాల మధ్య గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో తీవ్ర గాయాల పాలైన అతనిని తన కుటుంబ సభ్యులు జమ్మికుంటలోని శ్రీరామ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కు తీసుకువెళ్లగా పరిస్థితి విషమంగా ఉందని ఆసుపత్రి వారు తెలపడంతో మెరుగైన చికిత్స కోసం వరంగల్ ఎంజీఎంకు తరలించారు. గత నెల 25వ తేదీన తెల్లవారుజామున చికిత్స పొందుతూ మృతి చెందాడు. శుక్రవారం రోజున జాతీయ కళా రత్న అవార్డు గ్రహీత అంబాల ప్రభాకర్ (ప్రభు) భద్రయ్య కుటుంబ సభ్యులను పరామర్శించి 50 కిలోల బియ్యాన్ని అందజేసి, తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. భవిష్యత్తులో కూడా వారి కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో భారత రాష్ట్ర సమితి యువజన విభాగం నాయకులు హుజురాబాద్ నియోజకవర్గం అంబాల రాజు, ద్రావిడ కళామండలి వ్యవస్థాపక అధ్యక్షులు రామంచ భరత్, గంగారపు తిరుపతి, అంబాల సాయిలు, అంబాల చంద్రయ్య, అంబాల బిక్షపతి, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *