వ్యవసాయంలో డ్రోన్లు వినియోగంపై అవగాహన కార్యక్రమం
వ్యవసాయంలో డ్రోన్లు వినియోగంపై అవగాహన కార్యక్రమం

తిమ్మాపూర్, ఫిబ్రవరి 3 (విశ్వం న్యూస్) : కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మోగిలిపాలెం గ్రామంలో శుక్రవారం కృషి విజ్ఞాన కేంద్రం జమ్మికుంట, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో వ్యవసాయంలో డ్రోన్లు వాటి వినియోగంపై అవగాహన కార్యక్రమంతో పాటు ప్రదర్శన క్షేత్రం నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవ సాయ అధికారులు మాట్లాడుతూ అగ్రికల్చర్ డ్రోన్ ప్రాజెక్ట్ లో భాగంగా మొగిలిపాలెం గ్రామంలో 25 ఎకరాలలో డ్రోన్ యంత్రం ద్వార నానో యూరియా పిచికారి పై ప్రదర్శన నిర్వహించినట్లు, వ్యవసాయంలో డ్రోన్ వాడకం వల్ల సమయం, ఖర్చు ఆదా అవుతుందని కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు విజయ్ , శ్రీనివాస్ రెడ్డి, శ్రీనివాస్ లు తెలిపారు. ఈ కార్యక్ర మంలో గ్రామ సర్పంచ్ మొరపెల్లి సుస్మిత-రమణ రెడ్డి, మండల రైతు బంధు సమితి కో-ఆర్డినేటర్ సాయిల్ల కొమురయ్య, గ్రామ రైతు బంధు సమితి కో-ఆర్డినేటర్ మొరపెలి రాజిరెడ్డి, మండల వ్యవ సాయ అధికారి సురేందర్, సునీల్, వ్యవసాయ విస్తరణ అధికారులు ప్రవీణ్,స్వామి,రఘు, అర్చన, స్నేహ, రైతులు, తదితరులు పాల్గొన్నారు.
