నిహారిక విడాకులు..

హైదరాబాద్, జూలై 4 (విశ్వం న్యూస్) : నిహారిక కొణిదెల భర్త నుంచి విడిపోయారని కొన్నాళ్లుగా జరుగుతున్న ప్రచారానికి తెరపడింది. ఆ ప్రచారం నిజమేనని తేలింది. జొన్నలగడ్డ వెంకట చైతన్య నుంచి విడాకులు కావాలని కోరుతూ నిహారిక కోర్టుకెళ్లారు.

హైదరాబాద్లోని కూకట్పల్లి ఫ్యామిలీ కోర్టులో నిహారిక దరఖాస్తు చేసుకున్నారు. హిందూ చట్ట ప్రకారం విడాకుల కోసం ఆమె దరఖాస్తు చేసుకోగా.. కోర్టు గత నెల 5న వారికి విడాకులు మంజూరు చేసింది.
నిహారిక, చైతన్య పరస్పర అంగీకారంతోనే కోర్టులో విడాకుల పిటిషన్ దాఖలు చేశారు.
