ప్రధాని మోదీ వరంగల్‌ పర్యటన షెడ్యూల్‌ ఇదే

వరంగల్‌, జూలై 5 (విశ్వం న్యూస్) : ఈ నెల 8న ప్రధాని మోదీ వరంగల్‌లో పర్యటించనున్నారు. ఈ మేరకు ఆయన పర్యటన షెడ్యూల్‌ ఖరారైంది. మోదీ 8న ఉదయం దిల్లీ నుంచి బయల్దేరి 9.45 గంటలకి హైదరాబాద్‌లోని హకీంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. 9.50 గంటలకు హెలికాప్టర్‌లో వరంగల్‌కు బయల్దేరతారు. 10.35కి అక్కడి హెలిప్యాడ్‌కు చేరుకుంటారు.

10.45 నుంచి 11.20 వరకు వరంగల్‌లో పలు ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపనలు చేయనున్నారు. 11.30 నుంచి మధ్యాహ్నం 12.10 వరకు బహిరంగసభలో మెదీ ప్రసంగిస్తారు. అనంతరం 12.15కి వరంగల్‌ నుంచి హెలికాప్టర్‌లో బయల్దేరి 1.10 గంటలకు హకీంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో రాజస్థాన్‌ పర్యటనకు ప్రధాని వెళ్లనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *