పోలీస్ ప్రతిష్టను పెంపొందించేందుకు అధికారులు సమర్థవంతంగా పనిచేయాలి


-రాష్ట్ర డిజిపి అంజనీ కుమార్ (వీడియో కాన్ఫరెన్స్)
తిమ్మాపూర్, జనవరి 25 (విశ్వం న్యూస్) : రాష్ట్రంలోని అన్ని స్థాయిలకు చెందిన పోలీసులు సమర్థవంతంగా పనిచేస్తూ పోలీసు శాఖ ప్రతిష్టను పెంపొందించేందుకు కృషి చేయాలని రాష్ట్ర నూతన ఇన్చార్జి డిజిపి అంజనీ కుమార్ అన్నారు. పోలీసు శాఖ ప్రతిష్టను పెంపొందించేందుకు అంది వచ్చే ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
రాష్ట్ర డిజిపిపిగా పదవి బాధ్యతలు చేపట్టిన అనంతరం నూత డిజిపి అంజని కుమార్ బుధవారం నాడు రాష్ట్రంలోని వివిధ విభాగాలకు చెందిన ఉన్నత అధికారులు, కమిషనర్లు, జిల్లాలకు చెందిన ఎస్పీలు, వివిధ విభాగాలకు చెందిన అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… ప్రతి కేసును నిర్ణీత గడువులోగా నాణ్యత ప్రమాణాలతో దర్యాప్తులను పూర్తి చేయాల న్నారు. దర్యాప్తులు పూర్తయిన వెంటనే చార్జిషీట్లను సంబంధిత న్యాయస్థానాల్లో దాఖలు చేయాలని చెప్పారు. వివిధ రకాల నేరాల్లో నిందితులు ఎక్కువ శాతం శిక్షింప బడే విధంగా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి పోలీస్ స్టేషన్ అధికారి ఉత్తమ స్థాయిలో ఉండే విధంగా అధికారులు చర్యలు తీసుకుంటూ ముందుకు సాగాలని తెలిపారు. పోలీస్ స్టేషన్లలో పని విభాగాల ఏర్పాటు ద్వారా వేగవంతం ఏర్పడి సత్వరం పరిష్కారాలు కాపాడుతున్నాయని చెప్పారు.
పోలీస్ అధికారుల సిబ్బంది సర్వీస్ వివరాల డాటా హెచ్ఆర్ఎంఎస్ లో 100 శాతం పూర్తి కావాలని సూచించారు. నేరాల నియంత్రణ, చేదన కోసం నిరంతరం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రిసెప్షన్, క్రైమ్ వర్టికల్, టెక్ టీమ్, స్టేషన్ రైటర్, కోర్టు డ్యూటీ ఆఫీసర్స్ ఇలా ప్రతి విభాగం విధులు నిర్వహించే అధికారులకు సిబ్బందికి తరచుగా శిక్షణ తరగతులు నిర్వహించి వారి యొక్క పనితనాన్ని మరింత మెరుగుపరచాలని అధికారులకు సూచిం చారు. వర్టికల్స్ గా ఎంట్రీ చేసిన డాటాను నోడల్ అధికారులు రోజు తనిఖీ చేసుకోవాలని చెప్పారు.
13 విభాగాల్లో రాష్ట్రస్థాయిలో ప్రథమంగా కరీంనగర్ పోలీస్ కమిషనరేట్…
పోలీస్ స్టేషనులకు చెందిన వివిధ రకాల పని విభాగాల్లో కరీంనగర్ కమిషనరేట్ గత 6 నెలల నుండి రాష్ట్రంలో క్లస్టర్ – 2 విభాగంలో ప్రథమ స్థానంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు 12 విభాగాల్లో రాష్ట్రంలో మొదటి స్థానంలో కొనసాగుతూ వస్తున్న పోలీస్ కమిషనరేట్ తాజాగా 13 విభాగాలతో తన ప్రధమ స్థానాన్ని అలాగే కొనసాగిస్తూ వస్తోంది. ఈ విషయాన్ని వీడియో కాన్ఫరెన్స్లో రాష్ట్ర డిజిపి శ్రీ అంజని కుమార్ వెల్లడించారు. కమిషనరేట్ లోని పోలీసుల పనితీరును ఆదర్శంగా తీసుకుంటూ రాష్ట్రంలోని వివిధ జిల్లాలు కమిషనర్లకు చెందిన పోలీసులు కూడా ఉత్సాహంతో పని చేయాలని చెప్పారు. ఇందుకు కరీంనగర్ పోలీసుల పనితీరును ఆదర్శంగా తీసుకోవాలని చెప్పారు. కరీంనగర్ పోలీస్ కమిషనర్ ఈ నెలలో మరో అంశంతో పాటు 13 విభాగాల్లో రకాల పని విభాగాలలో రాష్ట్రస్థాయిలో ప్రధమ స్థానంలో నిలవడం పట్ల పోలీస్ కమిషనర్ వి సత్యనారాయణ కమిషనర్ లోని వివిధ విభాగాలకు చెందిన అధికారులను అభినందించారు. అధికారులు ఇదే స్ఫూర్తితో ముందుకు సాగుతూ మరిన్ని ఫలితాలు తీసుకురావాలని చెప్పారు. ఈ కార్య క్రమంలో పోలీస్ కమిషనర్ వి సత్యనారాయణ ఏసిపి లు తుల శ్రీనివాసరావు, కరుణాకర్ రావు, విజయ్ కుమార్, వెంకట రెడ్డి, సత్య నారాయణ, కాశయ్య, శ్రీనివాస్, ప్రతాప్, ఎస్బిఐ జి వెంకటేశ్వర్లు లతో పాటుగా కమిషనరెట్ లోని పలువురు పోలీసు అధికారులు పాల్గొన్నారు.