అంబేద్కర్ జయంతి సందర్భంగా
ఆర్ఎస్ఎస్ రూట్ మార్చ్
కరీంనగర్ బ్యూరో, ఏప్రిల్ 14 (విశ్వం న్యూస్) : భారత రాజ్యాంగ నిర్మాత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా శుక్రవారం సాయంత్రం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ ఎస్ ఎస్)కరీంనగర్ శాఖ ఆధ్వర్యంలో సమరసత సంచలన్ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా స్వయంసేవకులు సంఘ యూనిఫామ్ ధరించి పట్టణంలోని పలు ప్రాంతాల మీదుగా పథ సంచలన్ (రూట్ మార్చ్) కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇట్టి కార్యక్రమానికి ఆర్ ఎస్ ఎస్ ప్రాంత వ్యవస్థా ప్రముఖ్ గంటా తిరుమల్ ముఖ్య వక్తగా హాజరై మాట్లాడారు. భారత దేశ అత్యంత గొప్ప నాయకుల్లో డాక్టర్ భీమ్ రావ్ అంబేద్కర్ ఒకరిని, అత్యంత కటీక పేదరికాన్ని అనుభవిస్తూ ఉన్నత విద్య కొరకు విదేశాలకు వెళ్లి జ్ఞాన త్తృష్ణ ను తీర్చుకున్నారు.
ఆయనకు ఎవరూ సాటి రారని, స్వేచ్ఛ సమానత్వం గురించి ఆలోచించిన గొప్ప వ్యక్తి అంబేద్కర్ అని కొనియాడారు. ఈ అఖండంగా ఉంచడానికి దోహదం చేసే అనేక సూచనలు చేసినా ద్రష్ట శ్రీ అంబేద్కర్.. అందుకే దేశం మొత్తం ఆ గొప్ప నాయకుడిని జయంతిని ఘనంగా జరుపుకుంటుందని, ఆయన బోధనలను గుర్తు చేసుకుంటుందన్నారు. దేశంలోని కోట్ల మంది ప్రజలు డాక్టర్ అంబేద్కర్ ఉన్నత నైతిక ప్రమాణాలు సూత్రాల నుండి ప్రేరణ పొందుతున్నారని , రాజ్యాంగం రచించడంలో ఆయన స్థానం ప్రత్యేకమైక మైయిందన్నారు. అంబేద్కర్ చెప్పిన మాటలు సూక్తులు లక్షలాదిమందికి స్ఫూర్తిదాయకంగా నిలిచాయన్నారు. అందుకే అంబేద్కర్ జీవితం ఆదర్శంగా స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందన్నారు. భారతదేశ అభివృద్ధికి అంబేద్కర్ చేసిన అపురూపమైన కృషిని ప్రతి ఒక్కరూ గౌరవించుకోవాలన్నారు. ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ తో అంబేద్కర్ సత్సంబంధాలు కలిగి ఉన్నారని వివరించారు.
ఆర్ఎస్ఎస్ కార్యకర్తల ఆహ్వానం మేరకు 1939 సంవత్సరంలో ఆర్ఎస్ఎస్ సంస్థాపకులు డాక్టర్ తో కలిసి ఒకరోజు శిక్షణ శిబిరంలో అంబేద్కర్ పాల్గొన్నారని , 425 మంది కార్యకర్తలు పాల్గొన్న ఈ శిబిరంలో 100 కు పైగా షెడ్యూల్ కులాల కార్యకర్తలను అంబేద్కర్ శిబిరంలో చూసి ఆనందాన్ని వ్యక్తం చేశారని , తాను ఆశించిన సామాజిక సమానత కార్యాన్ని ఆర్ఎస్ఎస్ మౌనంగా చేస్తున్నదని వారు కొనియాడారని , హిందూ సమాజ సంఘటన చేస్తున్న ఆర్ఎస్ఎస్ పట్ల వారు ఎప్పుడూ పల్లెత్తు మాట అనలేదని , అంబేద్కర్ ఎప్పుడు ఆర్ఎస్ఎస్ తో సత్సంబంధాలు కలిగి ఉన్నారని తెలిపారు.
ఈ కార్యక్రమంలోడాక్టర్ కన్నం దుర్గెష్ మాననీయ విభాగ్ సంఘ్ చాలక్ మల్హోజుల కిషన్ రావు గారు, మాననీయ జిల్లా సంఘ్ చాలక్ చక్రవర్తుల రమణాచారి, జిల్లా సహా సంఘ్ చాలక్ ఎలగందుల సత్యనారాయణ, పాక సత్యనారాయణ , ప్రాంత గ్రామ వికాస్ ప్రముఖ్ జిన్నా సత్యనారాయణ రెడ్డి, కొండేటి బాలరాజు, సామాజిక సమరసత ప్రముఖ్ పురుషోత్తమ్ తదితరులు పాల్గొన్నారు.