వైభవంగా అంబేద్కర్ జయంతి

వీణవంక, ఏప్రిల్ 14 (విశ్వం న్యూస్) : వీణవంక మండలం వల్భపూర్ గ్రామంలో బాబా సాహెబ్ అంబేద్కర్ 132 సంవత్సరాల జయంతిని పూలమాల, పుష్పాలతో అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఎక్కటి రఘుపాల్ రెడ్డి, ఎంపీటీసీ జీడి దేవేందర్, జీడి వెంకటస్వామి, మారముల్లా కొమురయ్య, అందే కుమార్, మారముల్లా సదయ్య, మారముల్లా ప్రభు, పో రెడ్డి, తిరుపతి రెడ్డి, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.