

- పాలమ్మిన పూలమ్మిన కష్టపడ్డ, సక్సెస్ అయినా ఊదరగొట్టే మంత్రి మల్లారెడ్డి నియోజకవర్గ సమస్యలను పరిష్కరించడంలో ఎంతవరకు సక్సెస్ అయ్యాడో ప్రజలకు చెప్పాలి: టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు తోటకూర వజ్రెష్ యాదవ్…
ఘట్కేసర్, ఏప్రిల్ 26 (విశ్వం న్యూస్) : ప్రజా సమస్యలపై పోరాడేందుకు టిపిసిసి పిలుపుమేరకు చేపట్టిన హాత్ సే హాత్ జోడో కార్యక్రమం బుధవారం 4వ రోజుకు చేరింది రోజుకు చేరింది.ఈ కార్యక్రమంలో భాగంగా బుధవారం ఘట్కేసర్ మండలం చౌదరిగుడా ప్రతాప్ సింగారం గ్రామాలలో కొనసాగింది ఈ సందర్భంగా టిపిసిసి ఉపాధ్యక్షులు తోటకూర వజ్రెష్ యాదవ్ మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఏమి చేశాడో, ఏమి చేస్తాడో మాట్లాడకుండా తన సొంత డబ్బా కొట్టుకుంటుంటే నియోజకవర్గ ప్రజలు మంత్రి మల్లారెడ్డి తీరును చూస్తూ నవ్వుకుంటున్నారే తప్పా ఆయన నియోజకవర్గానికి ఏదో చేస్తారనే నమ్మకంతో ప్రజలెవ్వరూ లేరన్నారు.

ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి సరిత వెంకటేష్,తెలంగాణ యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ పొన్నం తరుణ్ గౌడ్,ఘట్కేసర్ మండల్ అధ్యక్షులు కర్రె రాజేష్,ఘట్కేసర్ మండల్ వర్కింగ్ అధ్యక్షులు బాబు రావ్ గౌడ్, మేడ్చల్ నియోజకవర్గం బి బ్లాక్ S.C సెల్ అధ్యక్షులు కుర్రే మహేష్,మండల్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు వినోద్,ఘట్కేసర్ మండల్ S.C సెల్ అధ్యక్షులు శ్రీనివాస్, ఘట్కేసర్ మండల్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు వినోద్,చౌదరిగూడ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కట్ట ఆంజనేయులు గౌడ్,ప్రతాప్ సింగారం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నత్తి కృష్ణ,ఎంపీటీసీ భాస్కర్ రెడ్డి,బండ్లగూడ అనిల్ గౌడ్, వార్డు సభ్యుడు భోజరెడ్డి, దాదిరెడ్డి, మంచాల సుధాకర్,బండ్లగూడ నగేష్ గౌడ్,శేఖర్ రెడ్డి, విజయ్ గౌడ్, బాలరాజ్,నర్సింగ్ రావ్ ముదిరాజ్,వెంకటేష్ యాదవ్,నర్సింహా, శ్రీనివాస్, పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్, కీసర, జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు తుంగతుర్తి రవి, కోళ్ల కృష్ణ యాదవ్,శ్రీకాంత్ యాదవ్, బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్ తోటకూర అజయ్ యాదవ్,మేడిపల్లి మండల్ కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ ఛైర్మెన్ ఐలేష్ యాదవ్,వెంకటాపురం గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు,సల్మాన్, ఘట్కేసర్ మండల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
