
- జమ్మికుంటలో రేషన్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి గోదాంలకు పంపిన వైనం..
- ఐదు రోజులైనా లారీలు గాని బియ్యన్ని గాని సీజ్ చేయని అధికారులు..
- బయటపడ్డ శ్రీ శక్తి ఇండస్ట్రీస్ మిల్లర్ల రీసైక్లింగ్ దందా..?
జమ్మికుంట, ఏప్రిల్ 25 (విశ్వం న్యూస్) : కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని శ్రీ శక్తి ఇండస్ట్రీస్ ఆభాదీ జమ్మికుంటలో రేషన్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి మళ్లీ గోదాములకు పంపిన వైనం. రీసైక్లింగ్ బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు ఎంక్వయిరీ చేసి సీజ్ చేస్తారా లేక వ్యాపారులకు కొమ్ముకాస్తారా వేచిచూస్తరా..? ఈ ఇల్లీగల్ వ్యాపారికి కూడా రాజకీయ నాయకుల అండదండలు ఉంటాయనీ అనుకోవచ్చా..?

వివరాల్లోకి వెళితే పై విషయాన్ని పురస్కరించుకొని సామాజిక కార్యకర్త కొండ్ల పాపయ్య మాట్లాడుతూ కరీంనగర్ జిల్లా కలెక్టర్, తెలంగాణ రాష్ట్ర సివిల్ సప్లై అధికారులకు శ్రీ శక్తి ఇండస్ట్రీస్ యజమాన్యంపై ఫిర్యాదు చేయడం జరిగిందనీ,సామాజిక నీరుపేద ప్రజల ఆకలి తీర్చేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ బియ్యాన్ని ఇస్తుందనీ కానీ శ్రీ శక్తి ఇండస్ట్రీస్ లాంటి దలార్లు రేషన్ బియ్యాన్ని రైస్ మిల్లుల్లో రీసైక్లింగ్ చేసి గోదాంలకు పంపించిన బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు గత ఐదు రోజుల కింద లారీలను నిలిపివేయడం జరిగింది కానీ ఆ లారీలను ఎందుకు సీజ్ చేయలేదనీ ప్రశ్నించారు.

రైస్ మిల్లులో లేని వడ్లపై అదేవిధంగా రేషన్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేసే పక్రియపై కరీంనగర్ జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేయడం జరిగిందనీ పేర్కొన్నారు.పై విజిలెన్స్ అధికారులు ఎప్పుడు తనిఖీ చేసిన గానీ వెంటనే సీజ్ చేసిన బియ్యాన్ని సంబంధిత అధికారులకు అందజేయాలి కానీ పై విషయంలో ప్రభుత్వ అధికారులు ఎందుకు జాప్యం చేస్తున్నారో అర్థం కావడం లేదని స్థానిక ప్రజలు నానా విధాలుగా చర్చించుకుంటున్నారు.

కాబట్టి వెంటనే జిల్లా కలెక్టర్, జిల్లా ఇన్చార్జ్ మంత్రి, ఎమ్మెల్సీ సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకొని రైస్ మిల్లర్ల దందా అదేవిధంగా దళారులను రీసైక్లింగ్ చేసిన వారిపైన కఠిన చర్యలు తీసుకొవాలని కోరారు.