పర్వతపూర్ సర్వేనెంబర్ 10, 11
సీలింగ్ భూమిపై ప్రజావాణిలో ఫిర్యాదు
- అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని స్వయంగా కలెక్టర్ కి ఫిర్యాదు చేసిన మార్టిన్
- కంచె ఎందుకు వేశారు ఇప్పుడు ఎందుకు తీస్తున్నారు.. ఎవరికోసం..
- అక్రమాలు ఎందుకు జరుగుతున్నాయో సమాధానం చెప్పాలని డిమాండ్..
పీర్జాదిగూడ, మే 9 (విశ్వం న్యూస్) : మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మేడిపల్లి మండలం పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పర్వతపూర్ సర్వే నెంబర్ 10,11 సీలింగ్ భూమిలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై జిల్లా కలెక్టరేట్ లో స్వయంగా ప్రజావాణిలో కలెక్టర్ ని కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది. వెంటనే కలెక్టర్ స్పందించి సంబంధిత శాఖ అధికారిని పిలిచి నేను ఇచ్చిన ఫిర్యాదును అతనికి ఇవ్వడం జరిగింది. కలెక్టర్ స్పందిస్తూ తక్షణమే ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకొని జరుగుతున్న అంశాలపైన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది.
ఈమేరకు ముడి మార్టిన్ మాట్లాడుతూ గతంలో పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ నూతనంగా ఏర్పడిన తర్వాత స్వయంగా రెవెన్యూ అధికారులతో పాటు కార్పొరేషన్ అధికారుల ఆధ్వర్యంలో చుట్టూ ఈ సీలింగ్ భూమికి ఫెన్సింగ్ వేయడం జరిగింది. తర్వాత క్రమంలో ఎవరి ప్రోద్బలంతో అధికారులు వేసినటువంటి ఫెన్సింగ్ తొలగించారు, ఇప్పుడు జరుగుతున్నటువంటి నిర్మాణాలను ఎవరు ప్రోత్సహిస్తున్నారని ప్రశ్నించారు. ఇప్పటికైనా అక్రమ నిర్మాణాల పైన చర్యలు తీసుకొని, అక్రమాలకు పాల్పడుతున్నటువంటి సంబంధిత అధికారుల పైన చట్టపరమైన చర్యలు తీసుకొని అట్టి స్థలాన్ని కాపాడవలసిందిగా డిమాండ్ చేశారు.