పెద్దపల్లి జిల్లా ప్రజాపరిషత్ డైరీ ఆవిష్కరించిన : మంత్రి కొప్పుల

పెద్దపల్లి జిల్లా ప్రజాపరిషత్ డైరీ ఆవిష్కరించిన : మంత్రి కొప్పుల

హైదరాబాద్, పిబ్రవరి 27 (విశ్వం న్యూస్) : పెద్దపల్లి జిల్లా ప్రజాపరిషత్ డైరీని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనారిటీ సంక్షేమ శాఖా మంత్రి కొప్పుల ఈశ్వర్ గారు ఆవిష్కరించారు. పెద్దపల్లి జిల్లా సమగ్ర సమాచారంతో రూపొందించిన డైరీని, హైదరాబాద్ లోని మినిస్టర్ క్వార్టర్స్ లో సోమవారం నాడు జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్ తో కలిసి మంత్రి కొప్పుల ఈశ్వర్ గారు ఆవిష్కరించారు. డైరీ రూపొందించినందుకు జెడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ కు మంత్రి కొప్పుల ఈశ్వర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ రేణుక, ధర్మారం జెడ్పిటిసి వూస్కూరు పద్మజతో పాటు జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *