మొక్కనాటిన ప్రకాశ్ అంబేద్కర్

మొక్కనాటిన ప్రకాశ్ అంబేద్కర్

  • ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ సృష్టికర్త జోగినిపల్లి సంతోష్ కుమార్ గారి ఆశయం గొప్పదన్నారు డా. బిఆర్ అంబేద్కర్ గారి మనవడు ప్రకాశ్ అంబేద్కర్

హైదరాబాద్, ఏప్రిల్ 14 (విశ్వం న్యూస్) : ‘తనను కలవాలనుకునే వారు తప్పనిసరిగా మొక్కలు నాటాలని చెప్పిన మా తాత బిఆర్.అంబేద్కర్’ గారి స్పూర్తిని కొనసాగిస్తున్న ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ సృష్టికర్త జోగినిపల్లి సంతోష్ కుమార్ గారి ఆశయం గొప్పదన్నారు డా. బిఆర్ అంబేద్కర్ గారి మనవడు ప్రకాశ్ అంబేద్కర్.

ఇవ్వాల బేగంపేటలో, రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారితో కలిసి ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ భాగంగా మొక్కను నాటిన ప్రకాశ్ అంబేద్కర్. ‘మనుషుల్లో సమానత్వం – ప్రకృతి సమతూల్యత’ కోసం పరితపించిన మా తాతగారు డా.బీఆర్. అంబేద్కర్ గారి జయంతి రోజున ఈ అద్భుతమైన కార్యక్రమంలో భాగం కావడం చాలా సంతోషంగా ఉందన్నారు. మా తాతగారు తాను ‘కేంద్ర న్యాయశాఖ మంత్రి’ గా ఉన్నప్పుడు తనను కలవాలనుకునే ప్రతీ ఒక్కరు ఒక మొక్కను నాటిన తర్వాతే తనను కలిసేందుకు రావాలని కోరుకున్నారు. మొక్కలు నాటడం పట్ల వారికి అమితమైన ఆసక్తి ఉండేది. ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్లీ ఆ స్పూర్తిని ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ లో చూస్తున్నాను.

ఇంత మంచి కార్యక్రమాన్ని తీసుకొని నిర్విఘ్నంగా ముందుకు తీసుకుపోతున్న రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమారి గారి కృషి అనితరసాధ్యమైనది. ఈ మధ్యలోనే ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ లిమ్కాబుక్ లో చేరడం నాకు చాలా ఆనందం కలిగించింది. వారి కృషికి మరింత గుర్తింపు రావాలి.. ప్రకృతి పచ్చదనంతో పరిఢవిల్లాలని మనస్పూర్తిగా కోరుకుంటూ సంతోష్ కుమార్ గారికి ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ బృందానికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అన్నారు.

ఈ కార్యక్రమంలో బి.సి. సంక్షేమశాఖా మంత్రి గంగుల కమలాకర్, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ తో పాటు ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ ప్రతినిధి సంజీవ రాఘవ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *