Today TrendingVishwam Newsహైదరాబాద్

పాలిటెక్నిక్ విద్యార్థుల పోరాటానికి విజయం.. సీఎం క్షమాపణ చెప్పాలి: దాసోజు శ్రవణ్

విశ్వం న్యూస్, హైదరాబాద్‌, నవంబర్ 15, 2026: పాలిటెక్నిక్ విద్యార్థుల సుదీర్ఘ పోరాటం ఫలించిందని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ డా. దాసోజు శ్రవణ్ అన్నారు. జీవో 97ను వెనక్కి తీసుకుంటూ ప్రభుత్వం జీవో 157 జారీ చేయడం ప్రభుత్వ తప్పిదానికి నిదర్శనమని విమర్శించారు. విద్యార్థులు, అధ్యాపకులపై లాఠీచార్జి చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలని, వారిపై పెట్టిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

జీవో 157లోనూ ప్రైవేటు, ఎయిడెడ్ పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తుపై స్పష్టత లేదని పేర్కొన్నారు. ఫీజులు, స్కాలర్‌షిప్పులు, ఈసెట్ లేటరల్ ఎంట్రీ అంశాలపై ప్రభుత్వం లిఖితపూర్వక హామీ ఇవ్వాలని కోరారు. ఇంటర్మీడియట్ వ్యవస్థను రద్దు చేసి పాఠశాలల్లో విలీనం చేయాలన్న ప్రతిపాదనను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు.

తెలంగాణకు విద్యావ్యవస్థపై అవగాహన, ప్రజాస్వామ్య విలువలు కలిగిన పూర్తికాల విద్యాశాఖ మంత్రి అవసరమని శ్రవణ్ స్పష్టం చేశారు. విద్యారంగంలో కీలక నిర్ణయాలు తీసుకునే ముందు విద్యార్థులు, అధ్యాపకులు, విద్యావేత్తలతో చర్చించాలని హితవు పలికారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *