అర్హులైన అభ్యర్థులకు న్యాయం చేయాలి.. ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి

అర్హులైన అభ్యర్థులకు న్యాయం చేయాలి.. ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి

అర్హులైన అభ్యర్థులకు న్యాయం చేయాలి.. ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి

ప్రీ ప్రైమరీ ఇన్‌స్ట్రక్టర్ల ఎంపికలో అక్రమాలపై విచారణ జరిపించాలి

విశ్వం న్యూస్, వరంగల్, 10 నవంబర్ 2026 : జిల్లాలో ప్రీ ప్రైమరీ ఇన్‌స్ట్రక్టర్ల ఎంపిక ప్రక్రియలో అక్రమాలు చోటుచేసుకున్నాయని, మెరిట్ విధానానికి విరుద్ధంగా అభ్యర్థులను ఎంపిక చేశారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎంపిక ప్రక్రియపై సమగ్ర విచారణ జరిపించి, అర్హులైన అభ్యర్థులకు న్యాయం చేయాలని శాసనమండలి డిప్యూటీ ఫ్లోర్ లీడర్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈ మేరకు వరంగల్ జిల్లాకు చెందిన పలువురు అభ్యర్థులు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిని కలిసి తమకు జరిగిన అన్యాయాన్ని వివరించారు. ఎంపిక ప్రక్రియలో ప్రభుత్వ నిబంధనలు, మార్గదర్శకాలను పక్కనపెట్టి అర్హతలకు విరుద్ధంగా కొందరిని ఎంపిక చేశారని ఆరోపిస్తూ వినతిపత్రం సమర్పించారు. మెరిట్ ఆధారంగా ఎంపిక జరగలేదని, దీనిపై ఉన్నతాధికారులతో విచారణ జరిపించాలని కోరారు.

అభ్యర్థుల సమస్యలను సానుకూలంగా ఆలకించిన ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి స్పందిస్తూ.. నిరుద్యోగ అభ్యర్థులకు ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం జరగకుండా చూస్తామని స్పష్టం చేశారు. ఎంపిక ప్రక్రియలో జరిగిన అవకతవకలపై సంబంధిత అధికారులతో మాట్లాడి, వాస్తవాలను వెలికితీసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం అర్హత కలిగిన ప్రతి అభ్యర్థికి న్యాయం జరగాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. అభ్యర్థులు ఎవరూ అధైర్యపడవద్దని, వారి సమస్య పరిష్కారానికి తన వంతు పూర్తి సహకారం అందిస్తానని భరోసా కల్పించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *