ప్రజా ఉద్యమాలకు సన్నద్ధంకండి
సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వెంకటరెడ్డి
గోవిందరావుపేట, జనవరి 14 (విశ్వం న్యూస్) : గోవిందరావుపేట మండలం పసరలో సిపిఎం పార్టీ మండల కమిటీ సమావేశం సోమ మల్లారెడ్డి అధ్యక్షతన జరిగింది ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి హాజరై మాట్లాడుతూ జిల్లాలో ప్రధాన సమస్యలు అన్ని పెండింగ్ లోనే ఉన్నాయని పేర్కొన్నారు ములుగు జిల్లాలో పోడు భూములకు 34 వేల మంది 93 వేల ఎకరాలకు దరఖాస్తు పెట్టుకుంటే ప్రభుత్వం కేవలం 2300 దరఖాస్తులు ఆమోదించినది 32 వేల దరఖాస్తులు తిరస్కరించినారు జిల్లాలో గిరిజనేతరులకు ఏ ఒక్కరికి కూడా హక్కు పత్రం ఆమోదించలేదు ముఖ్యమంత్రి కాస్తూ లో ఉన్న పోడు సాగుదారులందరికీ అక్కులు కల్పిస్తానని సంవత్సరం నుండి హడావుడి చేసి తీరా ఎవరికి కూడా హక్కు పత్రాలు పరిస్థితి ఏర్పడింది వెంటనే అర్హులైన పోడు సాగుదారులకు హక్కు పత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు . జిల్లాలో సాగునీటి సమస్య తీవ్రంగా ఉన్నది గోదావరి ములుగు జిల్లా నుండి ప్రవహిస్తున్న జిల్లా లో గోదావరి నీరు ఒక్క రామప్ప మినహా ఏ ఒక్క మండలానికి కూడా గోదావరి నీరు అందించలేదు ఇంతవరకు ప్రణాళిక కూడా లేదు అనేక ప్రాజెక్టులు పెండింగ్లో ఉన్నాయి వాజేడు మండలం లో గుండ్ల వాగు, మోడీ కుంట ప్రాజెక్టులు పెండింగ్లో ఉన్నాయి ప్రభుత్వం ప్రాజెక్టులకు నిధులు కేటాయించకుండా జిల్లా రైతుల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నా రూ వెంటనే పెండింగ్ ప్రాజెక్టు పూర్తి చేయాలి డిమాండ్ చేశారు కావున ప్రధాన సమస్యలపై భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన చేయాలని పిలుపునిచ్చారు మండలంలో గుండ్ల వాగు ప్రాజెక్టు నిర్మించిన ఇంతవరకు ప్రభుత్వం టేక్ ఓవర్ చేసుకోలేదు మరమ్మత్తులకు కాలువలకు నిధులు కేటాయించడం లేదు మండలంలో రైతులు లక్నవరం గాని గుండ్ల వాగు గాని కాలువలు సరిగలేక అనేక ఇబ్బందులు పడుతున్నారు ప్రభుత్వ వెంటనే కాలువలు లో పూడిక తీయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి తీగల ఆగి రెడ్డి, గోది రాజేష్, క్యాతం సూర్యనారాయణ, సప్పిడి యాదిరెడ్డి ,పిఎసిసి డైరెక్టర్ కుట్టెం కృష్ణారావు ,అంబాల మురళి, సామ చంద్రారెడ్డి, కాపకోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.