కలెక్టర్ కు పదోన్నతి… జేఏసీ శుభాకాంక్షలు

ములుగు, జనవరి 4 (విశ్వం న్యూస్) : ములుగు జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య కు పదోన్నతి లభించిన సందర్భంగా ములుగు జిల్లా జేఏసీ చైర్మన్ ముంజల బిక్షపతి గౌడ్ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా కలెక్టర్కు పుష్పగుచ్చం అందజేశారు. అనంతరం బిక్షపతి మాట్లాడుతూ కలెక్టర్ కృష్ణాదిత్య నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలు పరిష్కారంలో ఆయన కృషి అనిరువచనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో రామప్ప పరిరక్షణ కమిటీ కన్వీనర్ రామ్మోహన్రావు, రామప్ప పరిరక్షణ కమిటీ కో కన్వీనర్ నల్లెల్ల రాజయ్య యువజన సంఘం జిల్లా అధ్యక్షులు కత్తెరపల్లి భాస్కర్, అభివృద్ధి కమిటీ జిల్లా అధ్యక్షులు అన్నవరం రవికాంత్, బీసీ సంఘం కరీంనగర్ జిల్లా అధ్యక్షులు ముంజల కుమారస్వామి గౌడ్, ఎన్ పి ఆర్ డి రాష్ట్ర నాయకులు పొన్నం సంతోష్ గౌడ్, ముసలయ్య ఆలయ ప్రచార కమిటీ కార్యదర్శి గుండె మీద వెంకటేశ్వర్లు, మల్లేష్ గౌడ్ జేఏసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.