ఘనంగా సుడా చైర్మన్ కప్-2023

కరీంనగర్, ఫిబ్రవరి 12 (విశ్వం న్యూస్) : ఈ రోజు స్థానిక డా.బి.ఆర్ అంబేద్కర్ స్టేడియంలో సుడా చైర్మన్ జి వి రామకృష్ణారావు గారి సౌజన్యంతో ఒకినావా మార్షల్ ఆర్ట్స్ అకాడమీ రూపకర్త వసంత్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సుడా చైర్మన్ కప్-2023 ఇంటర్ స్టేట్ కరాటే ఛాంపియన్ షిప్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను ముఖ్య అతిథి రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినిపల్లి వినోద్ కుమార్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వీరితోపాటు బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారదాసు లక్ష్మణ్ రావు, నగర మేయర్ యాదగిరి సునీల్ రావు, జిల్లా గ్రంధాలయ చైర్మన్ పొన్నం అనిల్ గౌడ్ గార్లు పాల్గొన్నారు. మరియు షిహాన్ సంపత్ కుమార్, కె. మొండయ్య, సీనియర్ బ్లాక్ బెల్ట్స్ ప్రదీప్ కుమార్, మన్నన్, లింగయ్య, శ్రీనివాస్, నర్సింహులు చీఫ్ ఆఫీసియల్స్ గా, రిఫరీలుగా వ్యవహారించారు.
