రాహుల్ లీడర్ కాదు రీడర్:మంత్రి జ‌గ‌దీష్ రెడ్డి

హైదరాబాద్, జూలై 3 (విశ్వం న్యూస్) : రాహుల్ గాంధీ లీడ‌ర్ కాదు రీడ‌ర్ అని మంత్రి జ‌గ‌దీష్ రెడ్డి అన్నారు. హైద‌రాబాద్ లో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ…

  • రెండు సార్లూ ఏ ఐ సి సి అధ్యక్ష పదవిని అర్దాంతరంగా వదిలి పెట్టారు
  • రాసిచ్చింది చడవడమే ఆయన చేస్తున్న పని
  • నిన్నా, మొన్నా గల్లీ లీడర్లు మాట్లాడిన మాటలే ఆయన ఉటంకించారు
  • భాజపాకు బి ఆర్ ఎస్ రిశ్తేదార్ కాదు
  • రాహులే మోడీకి గుత్తేదారు
  • నాలుగువేల ఫించన్ ఏ హోదాలో ప్రకటించారు
  • కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో ఇస్తున్న ఫించన్ ఎంత
  • ఫించన్ ప్ల కార్డులు రాహులు తెలిసి పట్టుకున్నారా తెలియక పట్టుకున్నారా
  • నాలుగు వేల ఫించన్ ఇచ్చేది నిజమే అయితే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో ఎందుకు ఇవ్వడం లేదు
  • కాంగ్రెస్ పార్టీని కోనఊపిరితో బతికిస్తున్న చత్తీస్ ఘడ్ లో వృద్దులకు ఇచ్చేది 350 రూపాయలే
  • అదే రాష్ట్రంలో వికలాంగులకు 500,వితతంతువులకు ఇచ్చేది 350.
  • అదే పార్టీ ఎలుబడిలో ఉన్న రాజస్థాన్ లోనూ వృద్దులకు ఇచ్చేది 750,వికలాంగులకు 750,వితంతువులకు 550 మాత్రమే
  • సచ్చిపోతుందనుకున్న కాంగ్రెస్ పార్టీకి జీవం పోసిన కర్ణాటక లోనూ ఇచ్చేది అంతకంటే ఎక్కువ లేదు
  • కర్ణాటకలో వృద్దులకు 800,విజలాంగులకు 800,వితంతువులకు 800 రూపాయలే
  • కాంగ్రెస్ పార్టీకి జవసత్వాలు కల్పించిన కర్ణాటకలో, కోన ఊపిరితో ఉన్న చత్తీస్ ఘడ్ లో, పార్టీని నిలబెట్టిన రాజస్థాన్ లో 4,000 ఫించన్ ఎందుకు ఇవ్వడం లేదు
  • అందుకే ఆయనను లీడర్ గా కాకుండా రీడర్ గానే చూడాల్సి వస్తుంది.
  • గల్లీ నాయకులు రాసిచ్చిన స్క్రిప్ట్ ను చదివి వినిపించారు.
  • అది కుడా ఆయన ఏ హోదాలో ప్రకటించారు అన్నదే హాస్యాస్పదంగా మారింది
  • కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో ఇవ్వని ఫించన్లు తెలంగాణాలో ఇస్తామని ప్రకటించడానికి సిగ్గుఉండాలి
  • 4,000 ఫించన్ ప్రకటనను ఇక్కడి ప్రజలకు నమ్మ శక్యంగా లేదు
  • ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ దివ్వాంగులకు 4,000, వితంతువులకు 2016, వృద్దులకు 2,016 ఇస్తున్నారు.
  • కాళేశ్వరం కట్టిందే లక్ష కోట్లతో కట్టిన మొత్తంలో స్కామ్ జరిగిందంటూ ఆరోపణలు చేయడం రాహుల్ అజ్ఞానాన్ని బయట పడేసింది.
  • కాళేశ్వరం కట్టింది నిజమో కాదో తెలియడానికి రాహుల్ మెడిగడ్డ మీద నుండి దూకితే తెలుస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *