Rajinikanth:హిమాలయాల్లో
రజనీకాంత్.. ఫోటో వైరల్

ఆగస్టు 11 (విశ్వం న్యూస్) : సూపర్ స్టార్ రజినీకాంత్ కు ఓ సెంటిమెంట్ ఉంది. ఆయన ప్రతి సినిమా రిలీజ్ సమయంలో హిమాలయాలకు వెళ్తూ ఉంటారు. మానసిక ప్రశాంత కోసం ఆయన హిమాలయాలకు వెళ్లి సాధువులతో సమయాన్ని గడుపుతూ ఉంటారు. ప్రతి సినిమా రిలీజ్ సమయంలో హిమాలయాలకు వెళ్తూ ఉంటారు రజినీకాంత్.
తన స్నేహితులతో కలిసి రజనీ హిమాలయాలకు వెళ్లగా.. వంతెనపై తన స్నేహితులతో కలిసి ఫోటోలు దిగాడు. తెల్లటి కుర్తా, పైజామా ధరించి, నుదుటిపై బొట్టు పెట్టుకుని రజనీ ఉన్నాడు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.