జెండా ఎగరేసిన రామ్ చరణ్ కుమార్తె కొణిదెల క్లీంకార

  • చిన్ని చేతులతో జెండా తాడు పట్టుకున్న క్లీంకార
  • వెలకట్టలేని క్షణాలు అంటూ ఫొటోలను పంచుకున్న ఉపాసన

హైదరాబాద్, ఆగస్టు 16 (విశ్వం న్యూస్) : రామ్ చరణ్, ఉపాసనల ముద్దుల కుమార్తె క్లీంకార కొణిదెల స్వాతంత్ర్య దినోత్సవ సంబరాల్లో పాలుపంచుకుంది. ఉపాసన కొణిదెల ట్విట్టర్ వేదికగా రెండు ఫొటోలను షేర్ చేశారు. ‘అమ్మమ్మ, తాతయ్యలతో అమూల్యమైన క్షణాలు. క్లీంకార ఫస్ట్ ఇండిపెండెన్స్‌ డే’ అంటూ ఉపాసన షేర్ చేసిన ఫొటోలలో క్లీంకార ఫేస్ కనిపించి, కనిపించనట్లుగా కాస్త రివీలైంది.

అయితే ఈ ఫొటోలలో అమ్మమ్మ, తాతయ్యలు క్లీంకార చేతులు పట్టుకుని.. జెండా ఆవిష్కరణ చేశారు. ఇక ఈ పిక్స్ చూసిన మెగాభిమానుల ఆనందానికి అవధులే లేవంటే నమ్మాలి. ఈ పిక్స్‌లో క్లీంకారను చూసిన వారంతా.. హ్యాపీగా ఫీలవుతున్నారు. ప్రస్తుతం ఉపాసన షేర్ చేసిన ఈ ఫొటోలు సంచలనంగా మారాయి.

జూన్ 20న ఉపాసన ప్రసవించిన సంగతి తెలిసిందే. ఆ పాపకు క్లీంకార అని నామకరణం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *