రంజాన్ పండుగ ఏర్పాట్లను పరిశీలించిన కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి

రంజాన్ పండుగ ఏర్పాట్లను
పరిశీలించిన కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి

కరీంనగర్ బ్యూరో, ఏప్రిల్ 21 (విశ్వం న్యూస్) : రంజాన్ పండుగ సందర్భంగా నగరంలోని సలేహనగర్ ఈద్గా వద్ద ఏర్పాట్లను నగర కాంగ్రెస్ నాయకులతో కలిసి కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ గాలి దుమారంవల్ల పరదాలు,పైపులు దెబ్బతిన్నాయని వెంటనే ఏర్పాట్లు పూర్తి చేయాలని కోరారు.

గత ఏడాది తాగునీటికి ఇబ్బంది ఏర్పడిందని, ఎండలు మండిపోతున్నాయి. కాబట్టి తాగునీటి ఏర్పాట్లు చేయాలని కోరారు. యువకులు వాహనాలను అతివేగంగా నడుపవద్దని పండుగ సందర్భంగా రోడ్లు రద్దీగా ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఈద్గావద్దకు చేరుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గుండాటీ శ్రీనివాస్ రెడ్డి, ఎండి చాంద్, ఖాజాఖాన్, పొరండ్ల రమేష్, కీర్తి కుమార్, కంకణాల అనిల్ కుమార్, నదీమ్,జాఫర్, మహమ్మద్ భారీ, హనీఫ్, శివరాం, ఇమ్రాన్, బషీర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *