కేసీఆర్ పాలన రజాకార్లను మరిపిస్తుంది

కేసీఆర్ పాలన రజాకార్లను మరిపిస్తుంది

సభలో మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి

దద్దరిల్లిన రేవంత్ రెడ్డి సభ… పోటెత్తిన జనం
వరంగల్ బ్యూరో, ఫిబ్రవరి 6 (విశ్వం న్యూస్) : దేశాన్ని విభజించు పాలించు అనే ఆలోచనతో ఈరోజు కేంద్రంలోని నరేంద్ర మోడీ పాలన కొనసాగుతుందని టి పి సి సి అధ్యక్షుడు అనుముల రేవంత్ రెడ్డి ఆరోపించారు. సోమవారం మేడారం సమ్మక్క సారలమ్మ మన దేవతలను దర్శించుకుని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సారధ్యంలో పాదయాత్ర ప్రారంభించారు. ఈ పాదయాత్రకు ములుగు ఎమ్మెల్యే దనసరి సీతక్క రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం పలికి ఆహ్వానించారు. అనంతరం పాదయాత్ర మేడారం నుండి కొత్తూరు వెంగలాపూర్ ప్రాజెక్ట్ నగర్ తప్ప మంచ నుండి పసర చేరుకుంది. అనంతరం ఎమ్మెల్యే సీతక్క అధ్యక్షతన జరిగిన భారీ బహిరంగ సభలో రేవంత్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన రజాకార్లను మరిపిస్తుందని ఆయన ఆరోపించారు. కెసిఆర్ తొమ్మిదేళ్ల పాలనలో అన్ని వర్గాల ప్రజలు అవస్థల పాలయ్యారని ఆయన ధ్వజమెత్తారు. దేశం కోసం కాంగ్రెస్ పార్టీ ఎన్నో త్యాగాలు చేసిందని తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ అని ఆయన అన్నారు.

పాదయాత్రలో పాల్గొన్న రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే సీతక్క

రాహుల్ గాంధీ చేపట్టిన జోడయాత్ర కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు కొనసాగిందని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆల్ ఇండియా అధ్యక్షుడు మల్లికార్జున ఆదేశాల మేరకు ఈ పాదయాత్ర ప్రారంభమైందని ఆయన తెలిపారు. ఆనాడు రాజశేఖరరెడ్డి చేవెళ్ల నుండి ప్రారంభిస్తే నేడు సమ్మక్క సారక్క పోరాట స్ఫూర్తితో సోదరి సీతక్క నియోజకవర్గం నుండి పాదయాత్ర ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. కేంద్రంలోని బిజెపి రాష్ట్రంలో టిఆర్ఎస్ పాలన ప్రజలు చమర గీతం పాడాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సభకు ప్రజలు పెద్ద ఎత్తున మద్దతు పలికి హర్షద్వానాలు తెలిపారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మాణిక్యం టాగూర్, మాజీ ఎంపీ బలరాం నాయక్, అంజన్ కుమార్ యాదవ్, మధుయాష్కి, మాజీ మంత్రులు, కాంగ్రెస్ శ్రేణులు, పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *